/rtv/media/media_files/2025/04/14/uQCmxMDxM4V65p12bA7f.jpg)
sex assault case, Bengaluru
కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై అక్కడి మహిళలు మండిపడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. బెంగళూరులోని బీటీఎం లే అవుట్ లో ఒక వ్యక్తి ఇద్దరు యువతులను ఫాలో అయి...అందులో ఒకామెతో అసభ్యంగా ప్రవర్తించి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపైనే హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. పైగా బెంగళూరు పెద్ద సిటీ.. అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు కామన్ అంటూ కొట్టిపడేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి.
జల్లెడ వేసి మరీ గాలించారు..
మంత్రి వ్యాఖ్యలతో సంచలనంగా మారిన బెంగళూరు లైంగిక వేధింపుల కేసు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మంత్రి మాటలతో మొత్తం దృష్టి అంతా ఆ లైంగిక వేధింపులు చేసిన వ్యక్తి మీద పడింది. దాంతో బెంగళూరు పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. అందుకే గాలించి మరీ అతనిని పట్టుకున్నారు. మూడు రాష్ట్రాల్లో దాదాపు 700 సీసీటీవీ ఫుటేజీలను స్కాన్ చేసి మరీ అతనిని దొరకబట్టారు. నిందితుడు వీడియో బయటకు రాగానే బెంగళూరు నుంచి పారిపోయాడు. కేరళలో ఓ మారుమూల గ్రామంలో తలదాచుకున్నాడు. పోలీసులు అతనిని జల్లెడ వేసి మరీ పట్టుకున్నారు. నిందితుడు 26 ఏళ్ళ సంతోష్ అనే వ్యక్తి అని సంఘటన జరిగిన వెంటనే గుర్తించారు. అతను నగరంలో జాగ్వార్ షోరేంలో పని చేసేవాడని తెలుసుకున్నారు. ఘటన జరిగిన తర్వాత అతను బెంగళూర్ నుంచి తమిళనాడు హోసూర్ పారిపోయాడు. ఆ తర్వాత సేలం, కోజికోడ్‌కి వెళ్లాడు. కేరళలోని ఓ మారుమూల గ్రామంలో అతడిని పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు. దాదాపుగా పోలీసులు మూడు రాష్ట్రాల్లో వారం పాటు వేట కొనసాగించారు.
today-latest-news-in-telugu | bengaluru | sexual Harrassment | accused | arrest | cctv
Also Read: Big Breaking: సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని మళ్ళీ బెదిరింపు..ఈసారి ఇంట్లోకి దూరి మరీ..