Madhya Pradesh: మాజీ కానిస్టేబుల్ ఇంట్లో రెండున్నర కోట్ల నగదు సీజ్..

మధ్యప్రదేశ్‌లో మాజీ RTO కానిస్టేబుల్‌ సౌరభ్ శర్మ ఆస్తులు పెద్దమొత్తంలో బయటపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇంట్లో మరో రెండున్నర కోట్ల నగదును సీజ్‌ చేశారు.

New Update
Money Seized(File Photo)

Money Seized(File Photo)

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మాజీ RTO కానిస్టేబుల్‌  సౌరభ్ శర్మ నుంచి పెద్దమొత్తంలో ఆస్తులు బయటపడటం చర్చనీయమవుతోంది. నాలుగు రోజుల క్రితమే భోపాల్‌లో రోడ్డు పక్కన కారులో 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నగదు, బంగారం మాజీ కానిస్టేబుల్‌ సౌరభ్‌ శర్మకు చెందినవేనని అధికారులు గుర్తించారు. అలాగే ఆయన ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో మరో రెండున్నర కోట్ల నగదును సీజ్‌ చేశారు. అలాగే 234 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు.  

2013 నుంచి 2015 వరకు సౌరభ్ శర్మ రవాణా శాఖలో ఆర్టీవో కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఉద్యోగంలో ఉండగానే తీవ్ర అవినీతికి పాల్పడ్డారు. అతడి వద్ద దాదాపు వంద కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు ప్రస్తుతం అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 19న రాత్రి మెండోరి అటవీ ప్రాంతంలో ఓ కారులో 52 కిలోల నగదు, రూ.11 కోట్ల నగదును ఐటీశాఖ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం, నగదు మధ్యప్రదేశ్‌ నుంచి వేరే చోటుకి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 100 మంది వరకు పోలీసులు పాల్గొన్నారు.

Also Read: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు

మరోవైపు ఈ కేసుకు సంబంధించి లోకయుక్త పోలీస్ డైరెక్టర్ జనరల్ జైదీప్ ప్రసాద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' సౌరభ్ శర్మ తండ్రి ఆర్కే శర్మ ఒక ప్రభుత్వ వైద్యుడు. 2015లో ఆయన మరణించాడు. ఆ తర్వాత కారుణ్య నియామకం కింద 2015లో సౌరభ్‌ శర్మ రాష్ట్ర రవాణాశాఖలో కానిస్టేబుల్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2023లో ఇతడు స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. ఉద్యోగంలో ఉండా సౌరభ్ శర్మ భారీగా అవినీతికి పాల్పడ్డాడు. తన తల్లి, భార్య, మరదలు, సన్నిహితుల పేర్ల మీద పాఠశాల, హోటల్‌ను కూడా ఏర్పాటు చేశాడని'' జైదీప్ తెలిపారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment