Karnataka: కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

కర్ణాటకలోని మాండ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కీర్తి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
2 Killed 4 Injured In Explosion At Chemical Factory In Karnataka

2 Killed 4 Injured In Explosion At Chemical Factory In Karnataka

కర్ణాటకలోని మాండ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కీర్తి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగతున్నాయి. చాలాకాలంగా ఈ ఫ్యాక్టరీ పనిచేయడం లేదు. ఇందులోని సామాగ్రిని వేరే ప్రదేశానికి తరలిస్తున్నారు. అయితే ఆదివారం కెమికల్ ట్యాంక్ తొలగించేందుకు యత్నించగా ఈ పేలుడు జరిగింది. 

Also Read: వాలెంటైన్స్‌ డే రోజున ప్రియుడితో భార్య.. భర్త చేసిన పనికి అందరూ షాక్

2022లో కీర్తి కెమికల్స్‌ ఫ్యాక్టరీ నుంచి విషపూరిత వాయువు లీకేజీ అయ్యింది. దీనివల్ల స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. అలాగే పంటలకు కూడా నష్టం జరిగింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఫ్యాక్టరీని మూసివేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారుల జోక్యంతో ఫ్యాక్టరీ యజమానులు దాన్ని మూసేశారు. అప్పటినుంచి ఈ ఫ్యాక్టరీలో పనులు జరగడం లేదు. 

Also Read: ఢిల్లీ పేలుళ్ల కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు

ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ సామాగ్రి తరలిస్తుండగా పేలుడు సంభవించింది. మరణించిన కార్మికులు బిహార్‌కు చెందిన వాళ్లని పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు