/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
Maoists
ఛత్తీస్ ఘడ్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మధ్య అక్కడ పోలీసులు కూంబింగ్ చాలా ఎక్కువ అయింది. దానికి తోడు మావోయిస్టులే తమంతట తాము వచ్చి లొంగిపోయేలా బెటాలియన్ కృషి చేస్తోంది. దాని ఫలితమే ఈరోజు 17 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇందులో తొమ్మిది మంది తలలపై 24 లక్షల రివార్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దినేష్ మొడియం (36), అతడి భార్య జ్యోతి తాటి అలియాస్ కళా మొడియం (32) కూడా ఉన్నారని చెప్పారు. దినేష్ తలపై 8, జ్యోతిపై 5 లక్షల రివార్డ్ ఉంది. అలాగే అక్కడి ఏరియా కమిటీ సభ్యులు దుడ్ల కరంపై రూ.5లక్షలు, మరో ఆరుగురి తలలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందన్నారు.ఈ మావోయిస్టులందరూ గంగలూరు ఏరియా కమిటీలో పలు హోదాల్లో ఇప్పటి వరకూ చురుగ్గా ఉన్నవారే కావడం గమనార్హం. మావోయిస్టుల లొంగుబాటు వెనుక డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు కీలక పాత్ర పోషించారని బీజాపూర్ ఎస్సీ జితేంద్ర కుమార్ యాదవ్ వివరించారు.
పునారావాసం ఏర్పాట్లు..
మావోయిస్టుల మధ్య తేడాలే లొంగుబాటుకు కారణాలయ్యాయి. సైద్ధాంతిక లోపాలు, కొందరు అమాయక గిరిజనులను దోచుకోవడం లాంటి వాటితో నిరాశ చెందిన కొంత మంది మావోయిస్టులు ఈరోజు పోలీసుల ఎదుటకు వచ్చి లొంగిపోయారు. అలాగే గ్రామాల్లో అభివృద్ధి కోసం తాము చేపట్టిన నియా నెల్లనార్ అనే పథకం పట్ల ఆకర్షితులయ్యారని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి రూ. 25వేలు చొప్పున సహాయం అందించామని.. ప్రధాన స్రవంతిలోకి చేర్చేందుకు ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు.