/rtv/media/media_files/2026/04/10/narmada-river-video-viral-2026-04-10-19-55-44.jpg)
11,000 Litres Of Milk Poured In Narmada River video viral
మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిలో వేల లీటర్ల పాలను కుమ్మరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలు వృథాగా నదిలోకి పారబోయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సీహోర్ జిల్లా సత్‌దేవ్ గ్రామంలోని శ్రీ దాదాజీ దర్బార్ పాతాళేశ్వర మహాదేవ్ ఆలయంలో చైత్ర నవరాత్రి సందర్భంగా మతపరమైన కార్యక్రమం జరిగింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 7 వరకు 21 రోజుల పాటు జరిగింది. ఇందులో భాగంగా 41 టన్నుల నెయ్యితో మహాయజ్ఞం, శివమహాపురాణ పారాయణం వంటివి కూడా నిర్వహించారు.
11,000 liters of milk poured into the Narmada River!
— Jagruk Janta News With Bharat (@JAGRUK_JN) April 9, 2026
A tanker was parked by the riverbank, and the milk was offered by a man referred to as “Dada Ji Baba.” The act has sparked debates on faith. food wastage and environmental impact. #Narmada#MilkOfferings#ViralVideo#FaithVspic.twitter.com/Yn2gv1ncB7
Also Read: లెబనాన్‌పై వెనక్కి తగ్గని ఇజ్రాయెల్..పది నిమిషాల్లో 100 లక్ష్యాలపై దాడులు
ఈ మతపరమైన కార్యక్రమంలో 11,000 లీటర్ల పాలను నర్మదా నదిలోకి వదిలేయడం దుమారం రేపుతోంది. నదిని తల్లిగా భావించి భక్తితో అభిషేకం చేశామని నిర్వాకులు, భక్తులు తెలిపారు. ప్రతిరోజూ 151 లీటర్ల పాలను నీటిలో వదిలామని.. ఓ రోజు 1100 లీటర్లు, బుధవారం 11000 లీటర్ల పాలను పోశామన్నారు. నదిని శుభ్రం చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.
Also Read: నడిరోడ్డుపై డ్రైవర్ తల నరికిన వ్యక్తి.. వీడియో వైరల్
నదిలో పాలను పోసిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న రాష్ట్రంలో వేల లీటర్ల పాలను నదిలో వృథాగా పోయడం కన్నా ఆకలితో ఉన్న పిల్లలకు అందిస్తే బాగుండేదని సూచిస్తున్నారు. పర్యావరణ నిపుణులు కూడా ఈ ఘటనపై హెచ్చరిస్తున్నారు. నదిలో పాలను కలిపితే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగి, నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయని అంటున్నారు. దీనివల్ల చేపలు ఇతర జలచరాలకు ప్రాణహాని ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us