ఇంటి అద్దె చెల్లించని వ్యక్తితో నాలుగేళ్లుగా పోరాటం! ఖాళీగా ఉంది కదా అని ఇల్లు అద్దెకిచ్చిన పాపానికి ఇంటి యజమానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి.రూం అద్దెకు తీసుకున్న వ్యక్తి ఓనర్‌కి అద్దె కట్టకపోవడంతో కోర్టు చుట్టూ తిరిగాల్సి వచ్చింది.నెల కాదు, రెండు నెలలు కాదు ఏకంగా రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి అద్దె చెల్లించని వ్యక్తిని ఇంటి నుంచి వెళ్లగొట్టాల్సి వచ్చింది.ఈ చేదు అనుభవం ఏకంగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ క్యాపిటల్ మైండ్ సీఈఓకు ఎదురయ్యింది.ఆయన ఆవేదనను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.అంతేకాదు రియల్ ఎస్టేట్ చేయడం అంత ఈజీ కాదని పేర్కొన్నారు. By Shareef Pasha 26 Jul 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి ఓ కార్పొరేట్ సంస్థ సీఈఓ ఇంట్లో అద్దెకు దిగిన వ్యక్తి మొదటి నెల తర్వాత ఇంటి అద్దె చెల్లించడం మానేశాడు.దీంతో అతడిని ఖాళీ చేయించడానికి రెండేళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. తనకు ఎదురైన ఈ విచిత్రమైన అనుభవాన్ని బెంగళూరుకు చెందిన కార్పొరేట్ ఫైనాన్స్ అడ్వైజరీ కంపెనీ క్యాపిటల్ మైండ్ వ్యవస్థాపకుడు,సీఈఓ దీపక్ షెనాయ్‌కు సోషల్ మీడియాలో పంచుకున్నారు. మొదటి నెల తర్వాత అద్దె చెల్లించని ఆ వ్యక్తిని ఫ్లాట్ నుంచి బయటకు పంపడానికి తన తల్లికి రెండేళ్లు పట్టిందని ఆయన పేర్కొన్నారు.షెనాయ్ తనకు ఎదురైన అనుభవం గురించి వివరాలను రాసుకొచ్చాడు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఫ్లాట్ స్వాధీనం నాలుగేళ్లు సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అద్దెకు దిగిన వ్యక్తి నుంచి ఫ్లాట్‌ను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన పెద్దాయన గురించి వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా తన పోస్ట్‌కు జతచేశారు.వ్యక్తిగతంగా ఇలా జరిగింది.మొదటి నెల తర్వాత అద్దె చెల్లించడానికి నిరాకరించిన అద్దెదారుని ఖాళీ చేయమని అమ్మ రెండు సంవత్సరాల పాటు ప్రతి రెండు నెలలకు ఒకసారి కోర్టుకు వెళ్లింది.ఇంతకు ముందు వేరేవాళ్లను ఇలాగే వేధించారని అతడు కూడా తిరిగి మాపై కేసు పెట్టాడంటూ చెప్పుకొచ్చారు. కోర్టు ఉత్తర్వులు రావడానికి రెండు ఏళ్లు పట్టిందని తెలిపారు.ఆ తర్వాత అతడ్ని బయటకు పంపడానికి మరో మూడు నెలలు పట్టిందంటూ రాసుకొచ్చారు. పోలీసులు రావడానికి ముందు రోజు ఆ మోసగాడు ఖాళీ చేసి వెళ్లిపోయాడని తెలిపారు. గతంలోనూ సేమ్ సీన్ రిపీట్ Personally went through this...Mom went to the court house for two years once every two months to evict a tenant who refused to pay rent after the first month. He also filed a case saying henchmen used just like that. Had done this with other people too.It took two years to get… https://t.co/cDTHu1DsGq— Deepak Shenoy (@deepakshenoy) July 25, 2023 ఈ భయానక అనుభవం తన తల్లిని ఎంతగానో ప్రభావితం చేసిందని ఆమె తన ఆస్తులను చాలావరకు విక్రయించిందని చెప్పారు.ఆ తర్వాత అమ్మ స్థిరాస్తులన్నీ అమ్మేసి ఇప్పుడు తనకున్న ఒకే ఒక్క ఇంటిలో నివసిస్తోంది.కొంత భూమిని రౌడీలు ఆక్రమించుకున్నారని వాపోయారు.రియల్ ఎస్టేట్ మాకు కలిసి రాలేదు.చాలా తక్కువ మొత్తంతో మా ద్వారా మార్కెట్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించారని క్యాపిటల్ మైండ్ CEO జోడించారు.కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.బెంగళూరులోని జేపీ నగర్‌లో ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి వేణుగోపాల్ మెట్టూరు పద్మనాభన్ 2019లో తన ఇంటిని ఓ జంటకు అద్దెకు ఇచ్చారు.ఓ ఇంట్లో అద్దెకు దిగిన దంపతులు అడ్వాన్స్ కింద రూ.లక్షకు చెక్ ఇచ్చారు.అయితే నెల నెల అద్దె చెల్లించకపోగా వాళ్లు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది.దీంతో ఆయన కోర్టుకు వెళ్లడంతో నాలుగేళ్ల పాటు పోరాటం సాగించారు.ఇటీవలే ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. #bangalore #business #ceo #real-estate #room-rent మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి