PM Modi Swearing-in Ceremony: మోదీ 3.0.. కొలువుదీరిన కొత్త ప్రభుత్వం..

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీతో కలిపి మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేబినేట్‌ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

New Update
PM Modi Swearing-in Ceremony: మోదీ 3.0.. కొలువుదీరిన కొత్త ప్రభుత్వం..

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆయనతో సాయంత్రం 7.23 PM గంటలకు ప్రమాణం చేయించారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ , నితీష్ గడ్కరీ, అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోదీతో పాటు మొత్తం 71 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేబినేట్‌ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

Also Read: నీట్ పేపర్‌ లీక్‌ అయ్యిందా ? అసలేం జరిగిందంటే..

తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురు మంత్రులుగా 

మోదీ కేబినెట్‌లో మొత్తం 27 మంది ఓబీసీలు ఉన్నారు. ఎస్సీలు-10, ఎస్టీ-5, మైనార్టీ-5 మంది ఉన్నారు. ఇక ఎన్డీయే మిత్ర పక్షాల నుంచి 11 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 5 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), పెమ్మసాని చంద్రశేఖర్‌ (టీడీపీ), శ్రీనివాస వర్మ(బీజేపీ) ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలకు కేంద్రంలో ఎలాంటి పదవి దక్కలేదు.

నెహ్రూ రికార్డును సమం చేసిన మోదీ

ఇదిలాఉండగా.. గతంలో తొలి ప్రధాని అయిన జవహార్‌లాల్‌ నెహ్రూ వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మూడుసార్లు వరుసగా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఎవరికి రాలేదు. అలాంటి అరుదైన ఛాన్స్ ఇప్పుడు నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. 1971లో ఆరెఎస్సెస్‌ కార్యకర్తగా, ఆ తర్వాత 1985 నుంచి బీజేపీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన మోదీ అంచెలంచెలుగా ఎదిగి మూడు సార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2014, 2019లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2024లో కూడా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి నెహ్రూ రికార్డును సమం చేశారు.

Also Read: లోక్‌సభ స్పీకర్‌గా పురందేశ్వరి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు