nara lokesh:నారా లోకేష్ ను అరెస్టు చేస్తారా? పాదయాత్ర కొనసాగుతుందా..?

చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ తిరిగి రానున్నారు. దాంతో పాటూ ఎల్లుండి నుంచి యువగళం తిరిగి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి మరో షాక్ తప్పదా..? ఏపీ రాగానే నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారా.? లేదా ఆయన యువగళం పాదయాత్ర తిరిగి మొదలు అవుతందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

New Update
Pawan Kalyan: యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్.. అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఎల్లుండి నుంచి ఆయన పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో సెప్టెంబర్ 9 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. పదిహేనురోజులుగా యాత్ర నిలిచిపోవడంతో దాని ప్రభావం పార్టీ మొత్తంపై పడుతోంది. ఓ వైపు చంద్రబాబు జైల్లో ఉండటం, మరోవైపు లోకేష్‌ అందుబాటులో లేకపోవడంతో పార్టీలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉండిపోయిన లోకేష్ తిరిగి రావాలని డిపైడ్ అయ్యారు. ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణకు వస్తోంది. దీని తర్వాత లోకేష్ ఏపీకి రానున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఎల్లుండి రాత్రి 8.15 ని. లకు లోకేష్‌ యువగళాన్ని ప్రారంభించనున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో లోకేష్‌ నిత్యం సంప్రదిస్తున్నారు. అటు లీగల్‌ ఫైట్‌ కొనసాగిస్తూ.. ఇటు యువగళం తో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌, జగన్‌ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేయాలని నారా లోకేష్‌ నిర్ణయించారు.

మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14 గా నారా లోకేష్ పేరును చేర్చుతూ ఎసిబి కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. ఒకపక్క తండ్రి అరెస్టు రిమాండ్ కొనసాగుతున్న తరుణంలోనే మరోపక్క తనయుడు కు సంబంధించిన మరో కేసు అందులో ఏ 14 నారా లోకేష్ పేరు చేర్చడంపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఢిల్లీ లోని అశోక్ రోడ్ 50లో ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో మంగళవారం టిడిపి ఎంపీలు అందుబాటులో ఉన్న టిడిపి నేతలతో మరోసారి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్టు దారుణమని వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులుపై టిడిపి న్యాయ పోరాటం చేయాలని... నారా లోకేష్ ఇతర ఎంపీలు చర్చించారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని... తాము ఏ తప్పు చేయలేదని...పాదయాత్ర చేసి తీరుతామని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.

ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఆపార్టీ రాష్ట్ర నాయకులు చేరుకుంటున్నారు. సినీ యాక్టర్ మురళి మోహన్ తో పాటు పలువురు పార్టీ నేతలు నారా బ్రాహ్మణని కలిశారు. చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలియజేస్తూ అరెస్టును ఖండించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment