Viral Video: రాంచీ వీధుల్లో రయ్‌ రయ్‌.. ధోనీ బైక్‌ రైడింగ్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా!

హోండా రెప్సాల్ 150 మోట‌ర్ బైక్‌లో రైడింగ్ చేస్తూ రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీతో సెల్ఫీ కోసం ఓ అభిమాని ప్రయత్నించాడు.. అయితే అప్పటికే ధోనీ రయ్‌ రయ్‌మంటూ గేటు లోపలికి వెళ్లిపోయాడు. ఇటీవ‌ల వింటేజ్ కార్ల‌లో తిరుగుతున్న‌ట్లు క‌నిపించిన మహేంద్రుడు తాజాగా తనకు ఎంతో ఇష్టమైన బైక్‌లను డ్రైవ్‌ చేస్తూ కనిపించడం పట్ల ఫ్యాన్స్‌ తెగ ఆనందపడుతున్నారు.

New Update
Viral Video: రాంచీ వీధుల్లో రయ్‌ రయ్‌.. ధోనీ బైక్‌ రైడింగ్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా!

ధోనీ పేరు ప్రస్తావనకు రాగానే గుర్తొచ్చే విషయాలు ఐదు:

1) వికెట్‌ కీపింగ్‌

2) కెప్టెన్సీ

3) హెలికాఫ్టర్‌ సిక్స్

4) చెన్నై సూపర్‌ కింగ్స్

5) బైకులు


ఈ ఐదులో నాలుగు ధోనీకి ప్రొఫెషనల్‌ అయితే ఐదోది మాత్రం ప్యాషన్. బైకులన్నా.. బైక్‌ రైడింగ్‌ అన్నా ధోనీ(Dhoni)కి ప్రాణం. సమయం దొరికితే చాలు.. హెల్మెట్ పెట్టుకొని రాంచీ వీధుల్లో రయ్‌ రయ్‌మని దూసుకుపోతాడు ధోనీ. హెల్మెట్‌ పెట్టుకుంటే ఎవరూ గుర్తుపట్టరులే అనుకుంటాడు కానీ.. మహేంద్రుడు ఎన్ని ముసుగులు ధరించినా ఫ్యాన్స్‌ మాత్రం ఈజీగా కనిపెట్టేస్తారు. ధోనీ బైక్‌ రైడింగ్‌ని తమ కెమెరాల్లో బంధిస్తారు. వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇంకేముంది క్షణాల్లో ఆ పోస్టులు వైరల్‌గా మారిపోతాయి. ధోనీ బైక్‌ రైడ్‌(Bike ride) విజువల్ బయటకు వచ్చిందంటే ఈ కెప్టెన్‌ కూల్‌ ఫ్యాన్స్‌కు పండుగే.

సెల్ఫీ ప్లీజ్:
ధోనీ ఎక్కడ కనిపించినా సెల్ఫీల కోసం అభిమానులు పోటీ పడతారు. తాజాగా ధోనీ రాంచీలో తన హోండా రెపెసోల్ 150 బైక్‌పై రైడింగ్ చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ధోనీ గేటు లోపలకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'అయ్యో.. ధోనీ అతనికి సెల్ఫీ ఇవ్వాల్సిందని' కొందరు ఆ అబ్బాయిపై జాలి చూపిస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ బైక్‌ సూట్‌లో ధోనీ కింగ్‌లా ఉన్నాడని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. నిజంగానే ధోనీ గెటప్‌ మాములుగా లేదు.. అదిరిపోయిందంతే!

2024 ఐపీఎల్‌ ఆడుతాడా?
అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2019లోనే రిటైర్ అయిన ధోనీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ ట్రోఫీని కూడా గెలుచుకున్నాడు. లీగ్‌ హిస్టరీలో అత్యధికంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మతో కలిసి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు ధోనీ. ఈ ఇద్దరూ ఐదుసార్లు ఐపీఎల్‌ కప్‌ను సాధించారు. ఇక ఈ ఏడాదితోనే ధోనీ ఐపీఎల్‌ కెరీర్‌ ముగుస్తుందని అంతా భావించారు. మహేంద్రుడు కూడా రిటైర్‌మెంట్‌పై అనేకసార్లు హింట్ ఇచ్చాడు కూడా. కానీ అందరూ ఊహించినట్టు ధోనీ రిటైర్ అవ్వలేదు. దీంతో మరో ఏడాది ఐపీఎల్‌లో కూడా ధోనీ ఆడుతాడని ఫ్యాన్స్‌ ఆశలు పెట్టుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

LSG VS DC: లక్నో పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

ఐపీఎల్ లో ఈరోజు లక్నో సూర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో...ఢిల్లీ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. లక్నో ఇచ్చిన 159 టార్గెట్ ను క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  

New Update
ipl 2025

DC VS LSG

లక్నో సూపర్ జెయింట్స్ మళ్ళీ మ్యాచ్ ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 8వికెట్ల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. లక్నో ఇచ్చిన 159 టార్గెట్ ను ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  అభిషేక్‌ పోరెల్‌  36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌లతో 51 పరుగులు, కేఎల్‌ రాహుల్‌  42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు, అక్షర్‌ పటేల్‌  24 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లు 34 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ ను సునాయాసంగా గెలిచేశారు. ఢల్లీ బ్యాటర్లను సూపర్ జెయింట్స్ బౌలర్లు ఏ మాత్రం కట్టడి చేయలేకపోయారు.  లక్నో బౌలర్లలో మార్‌క్రమ్‌ రెండు వికెట్లు తీశాడు.

రాణించిన మార్ క్రమ్, మిచెల్ మార్ష్..

లక్నో వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటింగ్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు ఐదెన్ మార్‌క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) రాణించారు. నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2) విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్ (14) పరుగులు చేశాడు.ఆయుష్ బదోని (36) దూకుడుగా ఆడాడు. 9.5 ఓవర్లకు 87/0తో పటిష్టస్థితిలో లక్నో .. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఊహించిన దానికన్నా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్ 4, మిచెల్ స్టార్క్, దుష్మాంత చమీర ఒక్కో వికెట్ పడగొట్టారు.

today-latest-news-in-telugu | IPL 2025 | lsg | dc | match 

Also Read:  BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment