Lok Sabha Elections 2024 : ఆ రాష్ట్రంలో 2 వేలకు పైగా 100 ఏళ్లు దాటిన ఓటర్లు ముడో విడత లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారు ఉండటం విశేషం. By B Aravind 07 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Voters : ముడో విడత లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) మొదలయ్యాయి. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 93 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారు ఉండటం విశేషం. అలాగే రాష్ట్రంలో మొదటిసారిగా నాలుగు లక్షల మంది ఓటు వేయనున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలకు(Polling Booth) వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నిక సంఘం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Also Read: మూడో విడత పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లో ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ మూడో దశలో 26 మంది మహిళలతో పాటు మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. రాయ్‌పూర్‌లో అత్యధికంగా 38 మంది, బిలాస్‌పూర్‌లో 37 మంది, కోర్బాలో 27 మంది, దుర్గ్‌లో 25 మంది, జాంజ్‌గిర్-చంపాలో 18 మంది, రాయ్‌గఢ్‌లో 13 మంది, సుర్గుజాలో 10 మంది అభ్యర్థులు ఎన్నికల రంగంలోకి దిగారు. మొత్తం 15, 701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేటితో మూడో విడత పోలింగ్(3rd Phase Polling) ముగియనుండగా.. ఇంకా నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. Also Read: కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం #telugu-news #national-news #lok-sabha-elections-2024 #voters #chattisgarh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి