PM Modi:ఈనెల 30న పాలమూరుకు ప్రధాని మోదీ తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. మహబూబ్ నగర్ లో బీజెపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు. By Manogna alamuru 23 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. అక్టోబర్ 2 న రావాల్సి ఉండగా దాన్ని కొంచెం ముందుకు జరిపారు. మహబూబ్ నగర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. 30వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరులో ఐటీఐ గ్రౌండ్ లో సభ ఉండనుంది. ప్రధాని మోదీ సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా బీజెపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఈ సభను తెలంగాణ బీజెపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం లక్ష మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర బీజెపీ నేతలు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజెపీ గెలిచేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్ళి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకంటే తమ పార్టీనే బెటర్ అని ప్రజలకు ప్రచారం చేస్తున్నారు. అలాగే అక్టోబర్ 3 న నిజామాబాద్ కు కూడా ప్రధాని మోదీ రానున్నారు. ఇక్కడ కూడా బహిరంగ సభ లేదా రోడ్ షో ఉండవచ్చని లోకల్ బీజెపీ నేతలు చెబుతున్నారు. దీనికి సంబంధించి అక్టోబర్ 1 న బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని తెలిపారు. దీనికి రాష్ట్ర పదాదికారులు, జిల్లా అధ్యక్షులు , జిల్లా ఇంఛార్జి లు , పార్లమెంట్ ఇంఛార్జి లు, అసెంబ్లీ కన్వీనర్ లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. #telangana #narendra-modi #nizamabad #meeting #mahaboobnagar #prime-minister #palamuru #road-show #visit #september మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి