Manipur: మణిపూర్లో మరో దారుణం వెలుగులోకి... మణిపూర్ అల్లర్లలో చోటు చేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం అదృశ్యమైన ఇద్దరు విద్యార్ధులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి By Manogna alamuru 26 Sep 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి నాలుగు నెలలుగా మణిపూర్ రాష్ట్రం అట్టుకుడుతోంది. కుకీ, మైతీ కమ్యునిటీల మధ్య మొదలైన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. వందల ప్రాణానలు పొట్టనపెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మొత్తం దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రం నెమ్మదిగా కోలుకుంటోంది. ఇలాంటి టైమ్ లో మరో దారుణం వెలగులోకి వచ్చింది. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్ధులు అదృశ్యమయ్యారు. ఇప్పుడు వారి హత్య ఘటన బయటకు వచ్చింది. జూలైలో కనిపించకుండా పోయిన విద్యార్ధులు అల్లరిమూకల స్వాధీనంలో ఉన్న ఫోటోలు హఠాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా విద్యార్ధులు ఇద్దరూ దారుణంగా హత్యకు గురైన ఫోటో కూడా నెట్ లో కనిపించింది. దీంతో మళ్ళీ ఈ మొత్తం వ్యవహారం దేశంలో దుమారం రేపుతోంది. హిజామ్ కు 17 ఏళ్ళు, ఫిజామ్ హేమ్ జిత్ కు 20 ఏళ్ళు. వీళ్ళిద్దరూ మైతీ వర్గానికి చెందినవారు. జూలై 6వ తేదీన రాష్ట్రంలో ఆంక్షలు సడలించడంతో ఫిజామ్ నీట్ కోచింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. దాని తర్వాత తన స్నేహితుడితో బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్ళింది. అప్పటి నుంచి వారిద్దరి జాడా లేదు. ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంఫాల్ సమీపంలోని నంబోల్ వైపు వెళ్ళినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిందని అప్పట్లో పోలీసులు తెలిపారు. ఆ సమయంలోనే సాయుధులు వారిని కిడ్నాప్ చేసి హత్య చేసుండొచ్చని తెలుస్తోంది. మైతీ వర్గానికి చెందిన హిజామ్ లిన్ తో ఇంగంబి, ఫిజామ్ హేమ్ జిత్ లు అడవిలో గడ్డిలో కూర్చుని ఉన్నారు. వారి వెనుక అల్లరి మూకకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో నిలబడి ఉన్నారు. ఈ ఫోటోతో పాటూ మరో ఫోటో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో రెండు మృతదేహాలు నేల మీద పడేసినట్లు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి వారిద్దరినీ అల్లరి మూకలు హత్య చేశారని తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మణిపూర్ ప్రభుత్వం స్పందించింది. విద్యార్ధుల ఫోటోలు తమ దృష్టికి వచ్చాయని ప్రకటించింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లు తెలిపింది. విద్యార్ధులు ఎలా అదృశ్యమయ్యారు? ఎవరు కిడ్నాప్ చేశారు? హత్య చేసిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని మణిపూర్ ప్రభుత్వం చెబుతోంది. విద్యార్ధుల హత్యకు కారనమైన వారి మీద వేంగా చర్యలు తీసుకుంటామని....ప్రజలు శాంతంగా ఉండాలని కోరుతోంది. అయితే విద్యార్ధులు అదృశ్యమయి ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును ఛేదించడానికి ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ZRA Exposed What is their fault ? Being a Meitei , a non-KukiZo 17 year old student Linthoingambi and Phijam Hemanjit disappeared on 6th July where there phone was then traced few days later in #Kuki_Zo dominated area of Churachandpur. There was a massive appeal and plea… pic.twitter.com/AIVpHlA4Ki — Hero Thokchom (@hthokchom) September 25, 2023 Indian Media has been mediocre at straightforward stories. Bharka got an A+ on her coverage on Covid. Karan did many insightful coverages in the past.How did all of them fail so spectacularly on multi-layered stories in Manipur where they bit hook, line and sinker on what they… pic.twitter.com/7UF1ljvO3o — Skeeper (@Skeeper10) September 25, 2023 #murder #police #students #manipur #killed #india #government #kidnap #riots మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి