Andhra Pradesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దు-మంత్రి లోకేష్

పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులకు కొన్ని ముఖ్య ఆదేశాలను జారీ చేశారు. టీచర్‌ల మీద అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించాలని లోకేష్ చెప్పారు. బదిలీల విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని ఆదేశించారు.

New Update
Andhra Pradesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దు-మంత్రి లోకేష్

Minister Lokesh : ఇకపై ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరిగాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సచివాలయంలో ఈరోజు ఎడ్యుకేషల్ మినిస్టర్ మంత్రి లోకేష్ దాదాపు 3గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా విధివిధానాలు రూపొందించాలని లోకేష్ ఆదేశించారు. విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

publive-image

కేవలం బోధనే ఉండాలి...

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ ల భారాన్ని తగ్గించి, పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆర్డర్ పాస్ చేశారు. స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. నెక్ట్స్ మీటింగ్‌ కల్లా పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని లోకేష్ ఆదేశించారు.

మధ్యాహ్న భోజన పథకం..

మరోవైపు మధ్యాహ్న భోజన పథకం గురించి కూడా మంత్రి లోకేష్ సూచనలు, సలహాలను ఇచ్చారు.భోజన పథకం (Lunch Scheme) లో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులను వాకబుచేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్దఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్ కమ్స్, విద్యా ప్రమాణాల పెంపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు.

మిగతా దేశాలను పరిశీలించండి..

ఇక విద్యా ప్రమాణాల పెంపునకు దేశంలో అత్తుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా జర్మనీ, ఆస్ట్రియాతోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాల విద్యా వ్యవస్థలను మంత్రి ప్రస్తావించారు. రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో ఎక్కడ పాఠశాలల కొరత ఉంది, ఎక్కన నూతన పాఠశాలలు ప్రారంభించాలనే అంశాలపైనా ఈ సమావేశంలో అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు.

Also Read:WhatsApp: కొన్ని మొబైల్స్‌లో వాట్సాప్ బంద్..అందులో మీదుందా చెక్ చేసుకోండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు