Megastar Chiranjeevi: మెగాస్టార్ కి సర్జరీ.. అసలేం జరిగింది?? By E. Chinni 26 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి తెలుగు సినీ చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్థానం చెరగనిది. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎన్నో ఏళ్లుగా హవా చాటుతూ బాస్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. ప్రస్తుతం చిరు 'భోళా శంకర్' చిత్రంలో నటిస్తున్నారు. మరికొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. కాగా మెగాస్టార్ కి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరంజీవికి సర్జరీ జరిగిందని తెలుస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకోసమే ఆయన అమెరికా వెళ్లారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భోళా శంకర్ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో భార్య సురేఖతో కలిసి చిరు అమెరికా ట్రిప్ వేశారు చిరంజీవి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే అది విహారయాత్ర అనే అనుకున్నారంతా కానీ.. ఆయన సర్జరీ కోసం వెళ్లారనే విషయం లేటుగా బయటకొచ్చింది.. మెగాస్టార్ కొన్ని రోజులుగా కాలి సమస్యతో బాధపడుతున్నారట. ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందడానికే అమెరికా వెళ్లారు. కొన్ని రోజులు టూర్ చేసి ఆ తర్వాత కాలికి సర్జరీ సైతం చేయించుకున్నారట మెగాస్టార్. ఈ విషయాన్ని మొదటగా సీక్రెట్ గా ఉంచినప్పటికీ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం కాదని.. కాలికి మైనర్ సర్జరీ మాత్రమే జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో అభిమానులు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన 'భోళా శంకర్' సినిమాతో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఇక చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పోస్టర్స్ లో టాక్సీ డ్రైవర్ లుక్కులో చిరంజీవి ఆకట్టుకున్నారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధికారిక ప్రకటన ఇచ్చేసింది. ఈ చిత్రంపై మెగా లోకం భారీ అంచనాలు పెట్టుకుంది. #megastar-chiranjeevi #tollywood #tollywood-news #latest-news #leg-surgery #telugu-news #chiranjeevi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి