/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-09T214042.602.jpg)
China Ship Explosion: చైనాలోని అత్యంత రద్దీగా ఉండే విమానశ్రయంలో ఒకటైన నింగ్బో - ఔషాన్ పోర్టులో ఆగి ఉన్న ఓ నౌకలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు తీవ్రతకు దాదాపు 2 కిలోమీటర్ల మేర షాక్‌వేవ్ ప్రయాణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం ఈ భారీ పేలుడు సంభవించింది. అయితే ఇప్పటివరకు అక్కడ ఎలాంటి ప్రాణనష్టం వివరాలు తెలియలేదు. తైవాన్‌కు చెందిన యంగ్ మింగ్ మెరైన్ అనే ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన వైఎం మొబిలిటీ అనే కార్గోషిప్ మూడో టెర్మినల్‌లో ఆగి ఉంది. ఆ సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
There has just been a major explosion on the “YM Mobility” container vessel in the port of Ningbo.
The vessel operates on the service between Far East and the Middle East Gulf region. pic.twitter.com/5vin7fwYWo
— Arcadio Martinez (@tatin17) August 9, 2024
Also Read: RTV ‘ఆపరేషన్ దేశద్రోహం..’ ‘మేఘా’ పైకి సీబీ’ఐ’!
అయితే ఈ నౌక గల్ఫ్ దేశాలకు రవాణా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ పేలుడు జరిగే సమయానికి ఇందులో ప్రమాదకరమైన పదార్థాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు నుంచి నౌక ఉద్యోగులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయం