/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mahesh-2-1-jpg.webp)
Tollywood Stars in New Year Vacation: మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీని కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ సెలబ్రిటీలు అయితే కొత్త సంవత్సరాన్ని విదేశాల్లో జరుపుకునేందుకు పయనమైయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన కుటుంబంతో కలిసి దుబాయ్ కి వెళ్తున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎయిర్ పోర్టులో మహేష్ బాబు చేయిపట్టుకుని సితార (Sitara) నడుస్తుంటే..ఆ పక్కనే గౌతమ్ నమత్ర (Namrata) వెళ్తు కనిపించారు. అయితే గత కొద్ది రోజులుగా సూపర్ స్టార్ ఫ్యామిలీ న్యూయార్క్ లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నారని టాక్ నడిచింది. కానీ వీరంతా దుబాయ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. మహేష్ దుబాయ్ లో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్లారని..ఈ క్రమంలో అక్కడే కొత్త సంవత్సర వేడుకలను కూడా జరుపుకోనున్నట్లు సమాచారం.
Superstar @urstrulyMahesh off to Dubai for an AD shoot & a short vacation with Family ❤️🔥#GunturKaaram#MaheshBabu pic.twitter.com/xxXLU27dJ2
— Viswa CM (@ViswaCM1) December 29, 2023
Also read: కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే.. పూర్తి లిస్ట్!
ఇదిలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కే వెళ్లనున్నారని సమాచారం. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి(Sneha Reddy) కొన్ని ఫ్యామిలీ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అందులో అల్లు అర్జున్ తో పాటు వారి పిల్లలు అయాన్, అర్హలు కూడా ఓ బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్నారు.
అంతే కాకుండా అయాన్, అర్హ ఇద్దరు కూడా ఆటోలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న చిత్రాలను కూడా స్నేహ రెడ్డి పంచుకున్నారు. వాటిని చూసిన బన్నీ అభిమానులు చాలా బాగున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లారు.అక్కడ తన అభిమానులు , సన్నిహితులతో కలిసి ఆయన న్యూయర్ వేడుకలను జరుపుకోనున్నట్లు సమాచారం. అక్కడ ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ కి ఘన స్వాగతం పలికారు.
మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉండగా..అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఎన్టీఆర్ దేవర సినిమాను చేస్తున్నారు.