Mahesh Babu: మీరే నాకు నాన్న..మీరే అమ్మ..మీరే అన్ని..ఎమోషనల్ అయిన సూపర్‌ స్టార్‌!

మహేష్‌ తన తండ్రి కృష్ణను తలచుకుని స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు తండ్రి లేని లోటును అభిమానులే తీర్చాలని మహేష్‌ కోరాడు. చిన్నతనంలో ఆయన కోసమే సినిమాలు చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చారు.

New Update
Mahesh Babu : బెంగళూరులో బ్రాంచ్‌ ఓపెన్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌!

Gunturu Karam: సూపర్‌ స్టార్‌ అభిమానులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుంటూరు కారం చిత్రం మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సారి సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లి పోనున్నాయంటూ సూపర్‌ స్టార్ అభిమానులు ఇప్పటికే హడావిడి మొదలు పెట్టేశారు.
చాలా రోజుల తరువాత మహేష్‌ త్రివిక్రమ్‌ కాంబోలో రాబోతున్న మూడో చిత్రం ఇది. దీంతో ఈ చిత్రం మీద ఓ రేంజ్‌ లో ఎక్స్‌పెటేషన్స్‌ ఉన్నాయి.

విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ మొదలు పెట్టిన మేకర్స్‌ గుంటూరు లో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌ గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌ లో చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. ఈ వేడుకలో మహేష్‌ బాబు మాట్లాడుతూ..'' గుంటూరులో మొదటిసారి ఫంక్షన్‌ జరుగుతోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా త్రివిక్రమ్‌ వల్లే జరిగింది. ఆయనే గుంటూరు లో ఫంక్షన్‌ చేయాలనీ సూచించారు. అందుకే మేము కూడా వెంటనే ఒప్పేసుకున్నాం.

ఆ లోటును అభిమానులే తీర్చాలి..

ఈ ఈవెంట్ లో మహేష్‌ తన తండ్రి కృష్ణను తలచుకుని స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు తండ్రి లేని లోటును అభిమానులే తీర్చాలని మహేష్‌ కోరాడు. చిన్నతనంలో ఆయన కోసమే సినిమాలు చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. ఇక త్రివిక్రమ్‌ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఓ వింతలా ఉంటుంది...

ఆయన మా కుటుంబ సభ్యునిలాగా. ఆయన గురించి బయట ఎక్కువగా మాట్లాడలేను. ఒక కుటుంబ సభ్యుని గురించి పది మంది ముందు ఏం మాట్లాడతాం. రెండు సంవత్సరాల నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు. ఆయన ఈ రెండు సంవత్సరాలలో నాకు ఇచ్చిన స్ట్రెంత్‌, సపోర్ట్‌ ఎప్పుడూ కూడా మర్చిపోలేను. ఆయనకు నేను థ్యాంక్స్‌ చెబితే ఓ వింతలా ఉంటుంది. ఎందుకంటే మేమెప్పుడూ ఇలా మాట్లాడుకోము.

అంచనాలకు తగ్గట్లుగానే..

ఆయనతో సినిమాలు చేసినప్పుడల్లా నాలో ఓ కొత్త ఉత్సాహం పెరుగుతోంది. మొదటి సినిమా అతడుకు అలానే జరిగింది..రెండో సినిమా ఖలేజాకు అలానే జరిగింది. ఈ సినిమాలో మీరు కొత్త మహేష్‌ని చూస్తారు. మీ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటాను. దానికి కారణం కూడా త్రివిక్రమ్‌నే. మా ప్రొడ్యూసర్‌ చినబాబు కు నేను అభిమాన, ఇష్టమైన నటుడ్ని.

ఒక సినిమా చేసినప్పుడు నిర్మాత ముఖంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరు. మీతో ఇంకా ఇంకా సినిమాలు చేయాలని ఉందని మహేష్‌ అన్నారు. ఇక హీరోయిన్‌ విషయానికి వస్తే శ్రీలీల..చాలా ఆనందంగా ఉంది. ఓ తెలుగమ్మాయి..పెద్ద హీరోయిన్‌ అవ్వడం. ఆ అమ్మాయి షూటింగ్‌ విషయంలో , సినిమా విషయంలో చాలా డెడికేషన్‌ గా ఉంటుంది. షాట్‌ ఉన్నా లేకున్నా కూడా స్పాట్‌ లోనే ఉంటుంది తప్ప మేకప్‌ వ్యాన్‌ లోకి వెళ్లదు.

హీరోలందరికీ తాట ఊడిపోతుంది...

ఇక ఆమె డ్యాన్స్‌..వామ్మో అదేం డ్యాన్స్‌ ..హీరోలందరికీ తాట ఊడిపోతుంది. కానీ ఆమె తో కలిసి పని చేయడం నిజంగా మర్చిపోలేని అనుభూతి. ఇందులో గెస్ట్‌ రోల్‌ చేసిన మీనాక్షి కి కూడా స్పెషల్‌ థ్యాంక్స్‌. థమన్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి హైలెట్‌. ఇందులో మేము కావాలని చేయించుకున్న పాటలు కూడా ఉన్నాయి.

నాకు ఏం తెలియదు..

ఆ పాటలకు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. మీ అభిమానానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీ ఋణం తీర్చుకోలేను. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప..నాకు ఏం తెలియదు. మీరెప్పుడూ కూడా నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి మాకు కలిసి వచ్చింది. ఈ పండక్కి సినిమా వచ్చిందంటే కచ్చితంగా సినిమా హిట్టే. ఈ సారి కూడా పెద్ద హిట్‌ కొడతామని నమ్మకం ఉంది.

అన్నీ మీరే....

కానీ ఈసారి నాన్న మన మధ్యన లేరు. ఆయన నా సినిమా చూసి రికార్డులు కలెక్షన్స్‌ గురించి చెబుతుంటే ఆనందంగా ఉండేది. ఆయన ఫోన్‌ కోసమే సినిమాలు చేసేవాణ్ణి. ఇప్పుడు వాటి గురించి మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ..నాకు నాన్న..అన్నీ మీరే. మీ
మీ ఆశీస్సులు ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ముగించాడు.

Also read: నేడు ప్రపంచ హిందీ దినోత్సవం..ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment