ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికితోడు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సూచనలు చేసింది.శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.

New Update
Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు!

ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికితోడు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సూచనలు చేసింది.శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.

గత రెండు, మూడు రోజులుగా ఆకాశానికి చిల్లుపడినట్లుగా వాన కురుస్తోంది. దీంతో విద్యార్థులు కూడా స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల ప్రభావం ఎక్కువగా జిల్లాల్లో అధికారులు సెలవులు ప్రకటించారు. కృష్ణాజిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పీ రాజబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు అన్ని విద్యాసంస్థలు ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది.

వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరికొద్ది గంటల్లో బలపడి బుధవారానికి అల్పపీడనంగా.. ఆపై మరింత బలపడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి తోడు రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. రుతుపవన ద్రోణి కొనసాగుతూ ఉంది. దక్షిణ ఒడిస్సా, పరిసర ప్రాంతాలపై ఆవర్తనంగా కొనసాగుతుంది.

దీంతో ఎలాంటి సమయంలోనైనా మళ్లీ వరుణుడు విరుచుకుపడటం ఖాయమని హెచ్చరికలు ఇస్తోంది వాతావరణ శాఖ. ఈనెల 28 వరకు అప్రమత్తంగా, అలర్ట్‌ గా ఉండాల్సిందేనని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అతి భారీ వర్షాలు కురి అవకాశం ఉండటంతో పరిస్థితిని బట్టి ఏపీ ప్రభుత్వం సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు