/rtv/media/media_files/2025/04/07/AXT3ZuxZ7KnaI6iffV8o.jpg)
wife and husband deep closeness tips
సాధారణంగా భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. ఒకరిపై ఒకరికి కొన్నిసార్లు మనస్పార్ధాలు, విభేదాలు తలెత్తుతాయి. వాటిని త్వరగా పరిష్కరించుకోవాలి. లేదంటే భార్యా భర్తల బంధం విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల భార్యా భర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న మనస్పార్ధాలను మర్చిపోయి హ్యాపీ జీవితాన్ని గడపడానికి ట్రై చేయాలి. అయితే దంపతుల మధ్య గొడవలకు గల కారణాలను తెలుసుకుందాం.
Also read : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?
వేర్వేరు సమయాల్లో నిద్రపోవడం
భార్యా భర్తల మధ్య బంధం బలపడాలంటే.. ఇద్దరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వారు కలిసి పడుకోకపోవడం, ఇద్దరూ వేర్వేరు సమయాల్లో నిద్రపోవడం వంటివి ప్రతిరోజూ జరిగితే వారి సంబంధంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
Also read : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!
స్మార్ట్‌ఫోన్‌కు దూరం
భార్యా భర్తలు ఇద్దరూ బెడ్‌రూంలో ఉన్నపుడు మొబైల్ ఫోన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. మొబైల్ చూడడం, ఫ్రెండ్స్‌తో గంటలు గంటలు మాట్లాడడం వంటివి చేస్తే బంధంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల బెడ్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే మొబైల్ ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. మీ భాగస్వామితో ఆ రోజు జరిగిన విషయాల గురించి చర్చించుకోవాలి.
హ్యాపీగా మాట్లాడటం
చాలా మంది ఇతరులతో మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. కనీసం తమ భాగస్వామితో కూడా మాట్లాడరు. అలాంటి వారి సంబంధం చాలా కఠినంగా ఉంటుంది. ఎప్పుడైతే భాగస్వామితో మౌనంగా ఉంటారో అప్పుడు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధం బలహీన పడుతుంది. అందువల్ల ఇద్దరి మధ్య సంబంధం బలపడాలంటే.. తమ భావాలను ఒకరితో ఒకరు కచ్చితంగా షేర్ చేసుకోవాలి. సంతోషాలు, బాధలు, కష్టాలు, సుఖాలను చెప్పుకోవాలి.
Also read : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్
అర్థం చేసుకోవడం
చాలా మంది తమ భాగస్వామిని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతారు. తరచూ తమ భాగస్వామిపై కోపాన్ని చూపిస్తారు. తమ మాటే నెగ్గాలనే పట్టుదలతో ఉంటారు. ఎదుటివారు చెప్పింది వినిపించుకోరు. అందువల్ల ఇలాంటి వారు తమ కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఎదుటివారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. వారిని అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే భార్యా భర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది.
(lifestyle | healthy-lifestyle | human-lifestyle | latest-telugu-news | telugu-news)