/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/RAM-jpg.webp)
SRI RAMA NAVAMI 2025
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు జరుపుకుంటారు. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ చంద్రుడి ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున భక్తులంతా ఆలయాలకు క్యూకడుతుంటారు. శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించినందున.. అదే సమయంలో పూజలు చేస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఈ పండుగ రోజున శ్రీరామ రక్షను పఠించి, చేతికి దారం కట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది. ఆ పూజా విధానం గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Also Read : గ్రహాల మార్పు.. ఈ రాశుల వారికి పట్టనున్న కుభేర యోగం
జీవితంలో ఎదురయ్యే ప్రతికూల..
శ్రీరామ నవమి పండుగ రోజున రక్ష స్తోత్రం పఠిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. రామ రక్షను పఠించడం వల్ల నాలుక తిరగడంతో పాటూ మాట మెరుగుపడుతుందని వేద పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా.. శ్రీరాముడు నక్షత్ర రూపంలో భక్తులను రక్షించటంతోపాటు జీవితంలో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుంది. రామ రక్షను పఠించడంతోపాటూ కొన్ని ప్రత్యేక పరిహారాలను చేయాలని పండితులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: అవునా.. ఫిల్టర్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుందా.. నిజమెంత?
శ్రీరామ రక్షను పఠించడంతోపాటూ ఎరుపు, పసుపు దారం తీసుకుని రామ రక్ష చెప్పాలి. దారంలో ముందు ఒక ముడిని వేయాలని, దానికి కొద్ది దూరంలో రామ రక్షగా మరొక ముడిని వేయాలని ని వేద పండితులు చెబుతున్నారు. ఇలా రామ రక్షను 11 సార్లు చెబుతూ.. దారంపై 11 ముడులను వేయాలి. తర్వాత ఆ దారాన్ని శ్రీరాముడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. ఆ తర్వాత ఆ దారాన్ని మణికట్టుపై కట్టుకుంటే అంతా శుభమే జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.
Also Read : వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తింటే మంచిది
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: గోల్కొండలో ఘోరం.. బావను చంపిన బామ్మర్ది.. గొడవకు కారణం ఇదే!
latest-telugu-news | today-news-in-telugu | daily-life-style | human-life-style