Hair Loss: బట్ట తలతో బాధపడేవారికి శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు

జుట్టు కుదుళ్ల, ఎగువ, మధ్య భాగాలలో మూల కణాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ కణాలు క్షీణించినప్పుడు జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఈ మూల కణాలను తిరిగి నింపడం లేదా సక్రియం చేయడం వల్ల జుట్టు పెరుగుదలను పునరుద్ధరించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

New Update

Hair Loss: ప్రపంచంలోని సగం మంది పురుషులు బట్టతల లేదా జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. పురుషులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. విగ్గులు ధరించడం, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటివి చేయించుకుంటారు. అయితే శాస్త్రవేత్తలు బట్ట తల సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. బట్టతల, జుట్టు రాలడంతో బాధపడేవారికి శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. వెంట్రుకల కుదుళ్ల పైభాగం, మధ్య భాగాలలో ఉండే మూల కణాల సమూహం వెంట్రుకల పెరుగుదలను పునరుద్ధరించడంలో సహాయపడుతుందని వర్జీనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. 

జుట్టు పెరుగుదలలో..

యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు జుట్టు కుదుళ్లలో అంతగా తెలియని మూల కణాల సమూహాన్ని కనుగొన్నారు. కోల్పోయిన జుట్టును పునరుద్ధరించగలదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. జుట్టు కుదుళ్ల, ఎగువ, మధ్య భాగాలలో గతంలో పట్టించుకోని మూల కణాన్ని గుర్తించారు. ఇది జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కణాలు క్షీణించినప్పుడు జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఈ మూల కణాలను తిరిగి నింపడం లేదా సక్రియం చేయడం వల్ల జుట్టు పెరుగుదలను పునరుద్ధరించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పెర్ఫ్యూమ్‌లు అక్కర్లే.. వేసవిలో చెమట కంపు పోగొట్టే కలబంద!

హెయిర్ ఫోలికల్ ఎగువ, మధ్య ప్రాంతాలలో ఉన్న ఈ మెల్లబుల్ స్టెమ్ సెల్స్ మన జుట్టు కుదుళ్లలో ఉంటాయని అంటున్నారు. ఫోలికల్ ఉబ్బెత్తు బేస్ దగ్గర ఉన్న ప్రాంతంలోని మూల కణాలతో జుట్టు పెరుగుదల ప్రారంభమవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ మూల కణాలు ఒకరోజు ప్రజలలో జుట్టు రాలడాన్ని చికిత్స చేయడంలో ఉపయోగపడతాయని అంటున్నారు. మన శరీరంలోని లక్షలాది వెంట్రుకలు ఒక్కొక్క ఫోలికల్స్ నుంచి పెరుగుతాయి. ఇది వెసికిల్ నిర్మాణంపై కొత్త జీవం ఇస్తుంది. పరిశోధకులు మొదట మూల కణాలను కనుగొన్నారు. ఫోలికల్ ఏర్పడిన తర్వాత కణాలు ఇతర రకాల కణాలుగా మారతాయని, జుట్టు పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూనే ఉంటాయని చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మనిషిలో ఎంత కొలెస్ట్రాల్ ఉండాలి.. ఇంతుంటే గుండెపోటు వస్తుందా?


( hair-loss | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Parent Guide బిడ్డ పుట్టేముందు తల్లిదండ్రులు ఈ 5 అలవాట్లను పాటించాలి

సాధారణంగా గర్భధారణ సమయంలో స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫుడ్, లైఫ్ స్టైల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రెగ్నెన్సీలో అలవర్చుకోవాల్సిన కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

New Update
expectant parents tips

expectant parents tips

Parent Guide:  సాధారణంగా  స్త్రీలకు ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఎంతో కష్టమైన, ఇష్టమైన ప్రక్రియ. ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా కడుపులో పిండం పెరుగుతున్న సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది బిడ్డ మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో అలవర్చుకోవాల్సిన కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..  

బ్యాలన్స్డ్ డైట్ 

గర్భధారణ సమయంలో ఆహరం, ఆహారపు అలవాట్ల పై ప్రత్యేక శ్రద్ద వహించాలి. బిడ్డకు అన్ని పోషకాలు అందేలా సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పల్సెస్, తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి. తద్వారా తల్లి, బిడ్డ ఇద్దరికీ పోషకాలు లభిస్తాయి. 

మంచి నిద్ర 

ప్రతిరోజూ 7-9 గంటల నాణ్యమైన నిద్ర తప్పసరిగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో సరైన నిద్ర లేకపోవడం శారీరక , మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరం.

స్వీయ సంరక్షణ 

కాబోయే తల్లిదండ్రులు విశ్రాంతి,  ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలకు సమయం కేటాయించాలి. ఇవి లోపల బిడ్డపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు బుక్స్ చదవడం, స్నేహితులతో సమయం గడపడం వంటివి చేయాలి.

కుటుంబంతో సమయం 

కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు. అలాగే  కాబోయే తల్లిదండ్రులకు,  పుట్టబోయే బిడ్డకు మధ్య మంచి వాతావరణం ఏర్పడుతుంది. 

శారీరక శ్రమ 

చాలా మంది గర్భధారణ సమయంలో ఎక్కువగా  పడుకోవడం లేదా కూర్చోవడం చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదు. ప్రతిరోజు కొంత సమయం తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్ చేయడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి, బరువును నిర్వహించడంలో కూడా తోడ్పడతాయి. 

telugu-news | latest-news | life-style | parent-guide

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

Advertisment
Advertisment
Advertisment