HMPV Symptoms: దేశంలో 2 కేసులు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

చైనాలో పుట్టిన హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్(HMPV) ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకితే ఎగువ శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. HMPV సోకిన వారిలో ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

author-image
By Kusuma
New Update
HMPV virus india

HMPV virus

ప్రపంచ వ్యాప్తంగా హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్  (HMPV) ప్రజలను భయపెడుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచమంతటా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వల్ల చైనాలోని ఆసుపత్రులు, శ్మశాన వాటికలు నిండిపోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా, జపాన్‌లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తిస్తోంది. ఈ వైరస్ సోకిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఎగువ శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీసి ప్రాణాల మీదకు వస్తోంది. 

ఇది కూడా చూడండి:EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా..

లక్షణాలు

ఈ హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్ సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఉన్నవారు దగ్గిన, తుమ్మిన, శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడతారు. 

ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

నివారణ

ఈ వైరస్‌ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి.  దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు క్లాత్ అడ్డంగా పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. 

ఇది కూడా చూడండి:  Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

అయితే ఈ HMPV వైరస్ కొత్తదేమి కాదు.. దాదాపు 20 ఏళ్ల క్రితమే ఈ వైరస్‌ను వైద్యులు గుర్తించారు. కానీ ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. చైనా, జపాన్‌లో ప్రస్తుతం 7 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మళ్లీ కేసులు పెరిగితే లాక్‌డౌన్ రావడం పక్కా అని కొందరు అంటున్నారు. 

ఇది కూడా చూడండిDehydration: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు