/rtv/media/media_files/X5aWfmEFSFRse5H3P4mi.jpg)
Heart Attack
పాలు, నెయ్యి ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ రెండింటిని వేర్వేరుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ కలిపి తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొందరు ఈ రెండింటిని అన్నంలో వేసుకుని తింటుంటారు. ఇలా తింటే తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు
జీర్ణక్రియ సమస్యలు..
పాలు, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పూర్తిగా మందగిస్తుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. తిన్న ఆహారం జీర్ణం కావాలంటే ఎక్కువగా పని చేయాలి. లేదంటే కాలేయ సమస్యలు, బరువు పెరగడం, గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటిని కలిపి కాకుండా వేర్వేరుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్ అదానీ చిన్న కుమారుడి వివాహం!
ఇదిలా ఉండగా ఒక రోజులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పాలు కూడా రోజుకి ఒక నుంచి రెండు గ్లాసులు తక్కువ కొవ్వు ఉండే పాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకంటే ఎక్కువ పాలు తాగితే తప్పకుండా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి:Delhi Assembly Results: ఢిల్లీ పీఠం ఎక్కేదెవరు..నేడే అసెంబ్లీ ఫలితాలు!