Milk Vs Banana: పాలు, అరటిపండు కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

అరటిపండు, మిల్క్ షేక్ తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. అరటి పండును పాలతో కలిపి తినడం వల్ల కండరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. అరటి పండ్లలో ఉండే పొటాషియం కండరాల తిమ్మిరి, నొప్పి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

New Update
Milk Vs Banana

Milk Vs Banana

Milk Vs Banana: కొవ్వు తగ్గించుకోవాలనుకున్నా, కండరాలు పెరగాలనుకున్నా ఆహారంలో అరటిపండు, పాలు చేర్చుకోవడం సహాయ కరంగా ఉంటుంది. అరటి పండును పాలతో కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల పొటాషియం, ఫైబర్, కాల్షియం, ప్రోటీన్ లభిస్తాయి. పాలలో ఉన్న ప్రోటీన్ ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అరటిపండు, మిల్క్ షేక్ తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు.

తిమ్మిరి, నొప్పిని నివారిస్తుంది:

అరటి పండు, పాలలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో సహా అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి చాలా త్వరగా శక్తిని అందిస్తాయి. అరటి పండులో ఉండే సహజ చక్కెర, పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు కలిసి శక్తిని అందిస్తాయి. దీనిని అల్పాహారంలో తీసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి. అరటి పండును పాలతో కలిపి తినడం వల్ల కండరాల పునరుద్ధరణకు కూడా సహాయపడుతుంది. పాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల కలయిక కండరాల కోలుకోవడానికి సహాయపడుతుంది. అరటి పండ్లలో ఉండే పొటాషియం కండరాల తిమ్మిరి, నొప్పిని నివారిస్తుంది. 

ఇది కూడా చదవండి: మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా?.. అయితే.. ఈ విషయం మీ కోసమే!

అరటి పండును పాలతో కలిపి తినడం వల్ల ఎముకలకు కూడా మేలు జరుగుతుంది. పాలలోని కాల్షియం బలమైన ఎముకలు, దంతాలకు అవసరం. అరటి పండ్లలో విటమిన్ డి, పొటాషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. వీటిలోని ఫైబర్‌ జీర్ణక్రియను పెంచుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అరటి పండులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. అయితే పాలలో ఉండే తక్కువ కొవ్వు పదార్థం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అరటిపండు, పాలు రెండూ కలిసి తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ తినకుండా ఉంటారు, బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చర్మంపై ముడతలు పోవాలంటే ఇవి తినండి



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vaishakha Amavasya వైశాఖ అమావాస్య రోజున.. ఈ రాశుల వారు ఇవి దానం చేస్తే అన్నీ శుభాలే !

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27న వైశాఖ అమావాస్య వస్తుంది. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

New Update
Vaishakha Amavasya

Vaishakha Amavasya

Vaishakha Amavasya హిందూ మతవిశ్వాసాల ప్రకారం వైశాఖ అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఏడాదిలో 12 అమావాస్య తిథులు ఉంటాయి. అందులో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27 ఉదయం 4: 28 గంటలకు మొదలై 28 తెల్లవారుజామున 1: 02 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును పూజిస్తారు. అలాగే దానధర్మాలకు కూడా ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పితృదేవులకు పిండం, తర్పణం కూడా చేస్తారు. అయితే పితృదేవుల ఆత్మశాంతి కోసం  వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

రాశి చక్రం ప్రకారం చేయాల్సిన పనులు 

మేష రాశి 

 మేష రాశి వారు వైశాఖ అమావాస్య రోజున  తమ పూర్వీకులకు నీరు, షర్బత్, చల్లని వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. 

వృషభ రాశి 

వైశాఖ అమావాస్య రోజున వృషభ రాశి వారు డబ్బు, ఆహారాన్ని దానం చేయడం ద్వారా తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటారు. అలాగే శుభఘడియలు కూడా మొదలవుతాయి. 

కర్కాటక రాశి 

ఈ ప్రత్యేకమైన రోజున కర్కాటక రాశి వారు తెల్లటి ఆహార పదార్థాలను, ధనాన్ని ఎక్కువగా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు కలగడంతో పాటు పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. 

సింహరాశి 

సింహ రాశివారు బెల్లం, పప్పుదినుస్సులు, తేనే దానం చేయవచ్చు. వైశాఖ అమావాస్య రోజున ఈ దానాలు సింహరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడతాయి. 

కన్య రాశి 

వైశాఖ అమావాస్య రోజున కన్య రాశి వారు పూర్వీకుల ఆనందం కోసం నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను దానం చేయాలి. 

తులారాశి 

తులారాశిలో జన్మించినవారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తెల్లటి వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభాలు చేకూరుతాయి. 

వృచ్చిక రాశి 

వృచ్చిక రాశివారు బెల్లం, ఎర్రటి బట్టలు దానం చేస్తే పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

telugu-news | latest-news | life-style | zodiac-signs

Advertisment
Advertisment
Advertisment