Makar Sankranti 2025: ఈ సంక్రాంతి చాలా స్పెషల్.. 19 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ యోగం.. ఏ పని తలపెట్టినా తిరుగుండదు!

దాదాపుగా మూడేళ్ల తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి పండుగతో పాటు భౌమ పుష్య యోగం కూడా దాదాపు 19 ఏళ్ల తర్వాత రాబోతుంది. ఈ యోగంలో ఏ పని తలపెట్టిన కూడా అంతా విజయమే లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

New Update
Makar sankranthi  festival

Makar sankranthi festival Photograph: (Makar sankranthi festival)

అందరూ ఎదురు చూసే సంక్రాంతి పండుగ వస్తోంది. సాధారణంగా సంక్రాంతి పండుగను జనవరి 13 లేదా 14వ తేదీన జరుపుకుంటారు. అయితే దాదాపుగా మూడేళ్ల తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి రాబోతోంది. అయితే ఈ సమయంలో 19 ఏళ్ల తర్వాత మరో అరుదైన ఘటన వస్తోంది. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగతో పాటు భౌమ పుష్య యోగం కూడా రాబోతుంది. ఈ యోగంలో ఏ పని తలపెట్టిన కూడా అంతా విజయమే లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా!

మూడేళ్ల క్రితం జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకున్నారు. మళ్లీ ఇప్పుడు అదే తేదీన పండుగను జరుపుకుంటున్నారు. జనవరి 14వ తేదీన ఉదయం 8.56 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఏవైనా శుభ కార్యాలు తలపెట్టిన అన్నింటా విజయమే లభిస్తుంది. నర్మదా, గంగా వంటి పుణ్య నదుల్లో కూడా ఈ సమయంలోనే స్నానం చేస్తారు.

ఇది కూడా చూడండి: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?

జీవితం అంతా కూడా మధురంగా సాగుతుందని..

అలాగే ఆలయాల్లో బ్రాహ్మణులకు నువ్వులు, బెల్లం, కిచిడి, బట్టలు, దుప్పట్లు వంటి వాటిని దానం చేయాలి. మకర సంక్రాంతి రోజున కొందరు నువ్వులు, బెల్లం వంటివి తింటారు. వీటిని తినడం వల్ల జీవితంలో ఉన్న చేదు అంతా తొలగిపోయి.. అంతా మధురంగా సాగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే మకర సంక్రాంతి రోజు కొత్త పనులు ప్రారంభించాలని పండితులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి:Sankranthi Rangavalli 2025: సంక్రాంతికి సింపుల్ గా సూపర్ ముగ్గు.. 5 నిమిషాల్లోనే వేయిండిలా!

ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేసుకోవడం ఎలాగంటే?

ఒక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఇందులో కేజీ ద్రాక్ష పండ్లను వేసి ఉబ్బినంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత వడబోసి కాటన్ క్లాత్‌లో వేసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా నాలుగు రోజుల పాటు ఆరబెడితే హోమ్ మేడ్ కిస్‌మిస్ రెడీ.

New Update
raisins making

raisins making Photograph: (raisins making)

కిస్‌మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే వీటిని స్వీట్లు, తీపి పదార్థాలు ఇలా ప్రతీ దాంట్లో కూడా వేస్తారు. మరికొందరు వీటిని నానబెట్టి పరగడుపున తింటారు. అయితే మార్కెట్‌లో దొరికే కిస్‌మిస్‌లో కల్తీ ఉంటుంది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి కల్తీ లేకుండా సహజంగా ఇంట్లోనే కిస్‌మిస్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ద్రాక్ష పండ్లు మునిగేంత వరకు..

కిస్‌మిస్‌ను తయారు చేయడానికి కేజీ ద్రాక్ష, నీరు ఉంటే సరిపోతుంది. ఒక వెడల్పు ఉన్న గిన్నెలో ద్రాక్ష పండ్లు వేసి, మునిగేంత వరకు నీళ్లు, ఉప్పు వేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సగానికి పైగా నీళ్లు వేయాలి. నీరు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న ద్రాక్ష వేసుకుని ఓ 5 నిమిషాల పాటు ఉడికించాలి. 

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

అవి కాస్త ఉబ్బిన వెంటనే స్టవ్​ ఆఫ్​ చేసి వెంటనే వడకట్టాలి. వీటిని కాటన్ క్లాత్‌లో వేసుకుని ఎండలో ఉంచాలి. రెండు లేదా ఆరు రోజుల వరకు ఎండలో ఉంచితే అవి ఎండుతాయి. వీటిపై ఎలాంటి దుమ్ము, ధూళీ పడకుండా ఉండటానికి పల్చటి క్లాత్ కప్పాలి. ​అంతే ఇక కిస్‌మిస్ రెడీ అయినట్లే.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment