/rtv/media/media_files/2025/04/04/xTcU69CcUMf2dHbXG3pv.jpg)
wood apple benefits
వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన 'వెలపగపండు' (wood apple) అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బయట గట్టిగా రాయిలా కనిపించే ఈ పండు లోపల తీపి, పులుపు, వగరుతో కూడిన గుజ్జు పదార్థం ఉంటుంది. దీనిలో విటమిన్ సి, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, బీటా-కెరోటిన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, కెరోటిన్, విటమిన్లు బి1, బి2 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో ఈ పండును తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉడ్ యాపిల్ ( వెలగపండు) తినడం ద్వారా కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : పిల్లలకు ఎక్కువగా మొబైల్ ఇస్తే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
చల్లదనం
వెలగపండు సహజ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. సమ్మర్ లో దీనిని తినడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలోని అధిక నీటి శాతం ఎల్లప్పుడూ హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. దీనిని పచ్చడి, జ్యూస్ రూపంలో లేదా నేరుగా తినడం ఇలా అనేక విధాలుగా తింటారు.
Also Read : వారంలో 36 గంటలు శృంగార సెలవు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
మలబద్ధకం నుంచి ఉపశమనం
వెలగపండులోని ఫైబర్ మలబద్దకం నుంచి ఉపశమనం కలిగించడంలో తోడ్పడుతుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
/rtv/media/media_files/2025/04/04/vvv3siJ1QQuDFuLWJULp.png)
Also Read : మీకు కలలో ఈ ఐదు కనిపిస్తే అదృష్టం పట్టినట్లే!
యాంటీఆక్సిడెంట్లు
ఈ పండులో విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఎముకలకు బలం
ఉడ్ యాపిల్ లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్‌ను వంటి సమస్యలతో బాధపడేవారికి ఇదొక అద్భుత ఔషధం. దీనిలోని క్యాల్షియం ఎముకలను బలపరచడంలో సహాయపడుతుంది. అలాగే గాయాలైనప్పుడు రక్త శ్రావన్ని తగ్గించడంలో క్యాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
పుష్కలమైన పోషకాలు
ఈ పండు పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటుంది. విటమిన్ సి, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, బీటా-కెరోటిన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, కెరోటిన్, విటమిన్లు బి1, బి2 పోషకాలు ఉంటాయి.
Also Read: HIT 3: రిలీజ్ కి ముందే అర్జున్ సర్కార్ హవా.. భారీ ధరకు అమ్ముడైన 'హిట్3' డిజిటల్ రైట్స్.. ఎంతంటే
life-style | wood-apple | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | human-life-style | daily-life-style