/rtv/media/media_files/2025/02/12/7YmsPjqe33wsOtqML7gM.jpg)
mutton
చాలా మంది నాన్ వెజ్ లవర్స్ (Non-Veg Lovers) చికెన్ (Chicken) కంటే మటన్ ఎక్కువ ఇష్టంగా తింటారు. పోషక విలువల ప్రకారం చూసిన చికెన్ కంటే మటన్ లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అయినప్పటికీ ఏదైనా తగిన మోతాదులో తింటేనే ఆరోగ్యానికి మంచిది. అయితే తగిన మోతాదు తో పాటు నిర్దిష్ట సమయంలో కూడా తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మటన్ రాత్రి సమయాల్లో తినడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. రాత్రిపూట మటన్ తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : వాలెంటైన్స్ డే స్పెషల్.. ఒక్క హగ్ కి శరీరంలో ఇన్ని జరుగుతాయా!
రాత్రి పూట మటన్ తింటే ఏమవుతుంది.?
రాత్రిపూట మటన్ (Mutton) తినడం.. అది కూడా లేట్ నైట్ లో మటన్ తినడం అస్సలు మంచిది కాదు. అయితే మటన్ జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. దీనికి తోడు రాత్రి సమయాల్లో జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. కావున.. లేట్ నైట్ లో మటన్ తింటే జీర్ణమవక కడుపులో ఇబ్బంది తలెత్తుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది.
Also Read : శీతాకాలంలో కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగాలి?
కొవ్వు ఎక్కువ
మటన్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి పూట మటన్ తిని అలాగే పడుకోవడం ద్వారా శారీరక శ్రమలేక శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
Also Read : రాత్రి ఆలస్యంగా నిద్రిస్తున్నారా... ఈ తీవ్రమైన నష్టాలు తప్పవు
రక్తపోటు
అలాగే మటన్ లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచడానికి కారణం అవుతుంది. అంతేకాదు మటన్ ఎక్కువగా తినడం డయాబెటీస్ కూడా దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. పలు అధ్యయనాల ప్రకారం మటన్ ఎక్కువగా తినే వారిలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది. కీళ్ల నొప్పులు, గౌట్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
మటన్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. తినే సమయం మోతాదును దృష్టిలో పెట్టుకోవాలి.
Also Read : ఎండాకాలంలో కూలింగ్ వాటర్ తాగితే చనిపోతారా? వైద్యులు ఏం చెబుతున్నారంటే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.