/rtv/media/media_files/2025/04/11/9YR9dzuxa6Bsmivf1VNN.jpg)
Hanuman Jayanti-2025
హిందూమతంలో ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వేడుకను జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున భజరంగబలిని కూడా పూజిస్తారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ప్రత్యేకమైన రోజుగా ఉంది. శనివారం హనుమంతుడికి, శని దేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అటువంటి పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి వచ్చింది. ఈ రోజున హనుమంతుని ఆరాధించడం వల్ల శని దోషం, డబ్బు సమస్యలు తొలగిపోవడానికి ప్రత్యేక పరిహారాలు చేస్తే మంచిది. హనుమాన్ జయంతి రోజు సింపుల్ చిట్కాలు పాటిస్తే భూత, ప్రేత పిశాచాల భయాలు తొలగిపోతాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Also Read : తెలంగాణలో భూకంపం వచ్చే ఛాన్సే లేదు.. ప్రూఫ్స్ తో సహా చెప్పిన NGRI సైంటిస్ట్!
విముక్తి లభిస్తుంది:
హనుమాన్ జయంతి రోజున పీటపై.. ఎర్రని గుడ్డను ఉంచి ఆంజనేయ స్వామి చిత్ర పటాన్ని పెట్టాలి. ఆ పటం ఎదురుగా ఆవనూనెతో దీపం వెలిగించి తర్వాత అందులో నల్ల నువ్వులు వేయాలి. ఇలా చేస్తే శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. హనుమంతుడిని ఆరాధిస్తే శని ఆశీస్సులు లభిస్తాయి. ఆంజనేయుడి ఆశీస్సులు ఉంటే శని అనుగ్రహంతోపాట శని ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులుంటే హనుమాన్ జయంతి రోజున పంచదారను దానం చేయాలి. పంచదారతో తయారు చేసిన స్వీట్స్ ఇంటి చుట్టు పక్కల వారికి పంచిపెట్టవచ్చు. ఈ రోజున పేదలకు, నిరుపేదలకు అన్నదానం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చట్టపరమైన, ఆస్తి వివాదాలు తొలుగుతాయి.
ఇది కూడా చదవండి: 25 ఏళ్ల వయసులో చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే
Also Read : కసబ్ కోసం రూ.28 కోట్లు ఖర్చు.. తహవూర్ రాణా కోసం ఎంత ఖర్చు చేయాలో ?
హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడికి శనగ పిండి, ఎర్ర చోళం సమర్పించి.. మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి. హనుమాన్ చాలీసా చేయడం వల్ల డబ్బు సమస్యలు తొలగి, అప్పుల సమస్యల నుంచి బయట పడతారు. అంతేకాదు ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. హనుమాన్ జయంతి రోజున ఉపవాస ఉంటే సకల కోరికలు, అన్ని బాధలు, సంక్షోభాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజూ ఆంజనేయస్వామి ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలిజ. తర్వాత ఓం ఆంజనేయాయ విద్మహే .. మహాబలాయ ధీమహి తన్మో హనుమత్ ప్రచోదయాత్ అని108 సార్లు పఠిస్తే ఆనందమైన జీవితం లభిస్తుంది. హనుమంతుడు రాముని ప్రత్యేక భక్తుడు. ఈ రోజున శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ అనే మంత్రాన్ని జపించినా సానుకూల శక్తి వస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: బాల్కనీలో పావురాలతో ఇబ్బంది పడుతున్నారా?. ఇలా చేయండి
(hanuman-jayanti | latest-telugu-news | Hanuman Jayanti 2025 | today-news-in-telugu | daily-life-style | human-life-style)