/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/handsome-man-wake-up-raising-hand-ben-morning-scaled.webp)
Early Morning
ఆరోగ్యాన్ని కాపాడేది మనం అనుసరించే ఆహారపు అలవాట్లే. ఏదైనా ఆహారం ఎంత మంచిదైనా సరైన సమయంలో తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. అయితే చాలా మంది తెలియక ఉదయం పూట కొన్ని రకాల పదార్థాలను పరగడుపున తీసుకుంటారు. అయితే ఖాళీ కడుపుతో తీసుకోకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!
కాఫీ, టీ
పొద్దున్నే లేవగానే చాలామంది కాఫీ లేదా టీ తాగడం అలవాటుగా మార్చుకుంటారు. కానీ, ఖాళీ కడుపుతో ఇవి తాగితే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోతుంది. దీని వల్ల అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం సమస్యలు తలెత్తుతాయి.
సిట్రస్ పండ్లు
ఆరెంజ్, నిమ్మ వాటిలో అధికంగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి ఖాళీ కడుపుతో తింటే అదనపు యాసిడ్ ఉత్పత్తి పెరిగి, గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ
అరటి పండ్లు
అరటిపండులో అధికంగా సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనిని ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగి, ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు.
అధిక చక్కెరగల ఆహారాలు
ఉదయం పూట స్వీట్లు, చాక్లెట్లను అసలు తినకూడదు. వీటిని తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !
స్పైసీ ఫుడ్స్
అధిక మసాలా కలిగిన ఆహారం ఖాళీ కడుపుతో తింటే జీర్ణక్రియ పై ప్రభావం చూపిస్తుంది. కడుపులో మంట, అజీర్ణం, అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!