/rtv/media/media_files/2025/02/02/4kOKGVZopbyshWYs6uYC.jpg)
bath
వేసవిలో ఎక్కువగా అలసటకు గురవుతుంటారు. అయితే ఉదయం పూట కొన్ని రకాల పదార్థాలతో స్నానం చేస్తే రోజంతా ఎలాంటి అలసట లేకుండా హాయిగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవిలో వేటితో స్నానం చేస్తే హాయిగా ఉంటారో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
పాలు, తేనె
పాలు, తేనె మిశ్రమం కలిపి స్నానం చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. బకెట్ వాటర్‌లో ఈ మిశ్రమాన్ని కలపాలి. అవసరం అయితే ఇందులో కొన్ని గులాబీ రేకులను అయినా వేయవచ్చు. ఇలా స్నానం చేస్తే రోజంతా తాజాదనంతో ఉండటంతో పాటు ప్రకాశవంతంగా మెరిసిపోతారు. చర్మంపై ఉండే మృత కణాలను కూడా తొలగిస్తుంది.
ఇది కూడా చూడండి: UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు
బేకింగ్ సోడా
స్నానం చేసే నీటిలో బేకింగ సోడా వేసి చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. ఇందులోని పోషకాలు చర్మంపై ఉండే ట్యాన్‌ను తొలగిస్తుంది. బేకింగ్ సోడా ఎక్స్‌ఫోలియేటర్‌గా బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం
కీరదోస తొక్క
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కీరదోస తొక్క రసాన్ని బకెట్ వాటర్‌లో వేసి స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మీరు కూడా రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. వీటిని వాడితే మీ చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!