live longer: అందరికన్నా వీళ్లు మూడేళ్లు ఎక్కువ జీవిస్తారు.. ఎందుకంటే?

వీర్యకణాల నాణ్యత ఎక్కువగా ఉండే మగవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారని డెన్మార్క్‌‌ కోపెన్‌హెగెన్‌ యూనివర్సిటీ చేసిన అధ్యాయనంలో తేలింది. 50ఏళ్లగా 78 వేల మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ ఎక్కువుంటే 3ఏళ్లు ఎక్కువగా బతుకుతారని తెలిసింది.

New Update
Danish scientists

Danish scientists Photograph: (Danish scientists)

డెన్మార్క్‌‌లోని కోపెన్‌హెగెన్‌ యూనివర్సిటీ చేసిన అధ్యాయనంలో షాకింగ్ విషయాలు వెల్లడైయ్యాయి. మగవాళ్ల ఆయుష్షు వారి వీర్య కణాల నాణ్యతతో ముడిపడి ఉంటుందని రీసెర్చ్‌లో తేలింది. నాణ్యమైన, చురుకైన వీర్య కణాలు కలిగి ఉన్న వ్యక్తులు సాధారణ పురుషుల కంటే మూడేండ్లు ఎక్కువ జీవిస్తారని పరిశోధకులు గుర్తించారు. కోపెన్‌హెగెన్‌ మెడికల్ యూనివర్సిటీ సైంటిస్టులు 50 ఏండ్లుగా 78 వేల మంది పురుషులపై అధ్యయనం జరిపారు. 

స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న పురుషుల కంటే ఎక్కువ ఉన్న వారి జీవితకాలం ఎక్కువని తాజా అధ్యాయనంలో తేలింది. ప్రతి మిల్లీలీటరుకు 120 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్న పురుషులు.. శుక్ర కణాలు 5 మిలియన్లు ఉన్న పురుషుల కంటే 2.7 సంవత్సరాలు ఎక్కువకాలం జీవించారని పరిశోధకురాలు లార్కే ప్రిస్కో ర్న్‌ చెప్పారు. స్పెర్మ్ సెల్స్ యాక్టివిటీ తక్కువ ఉన్న వ్యక్తి 77.6 సంవత్సరాల వరకు, అధిక చలనశీలత ఉన్న వ్యక్తి 80.3 సంవత్సరాల వరకు జీవించవచ్చునని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Desi Ghee: వేసవిలో దేశీ నెయ్యి ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?

వేసవి కాలంలో శరీరం త్వరగా నీరసం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో తరచూ ఎదురయ్యే కడుపు సంబంధిత సమస్యలు నెయ్యితో దూరం చేయవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీ స్పూన్ దేశీ నెయ్యి తీసుకోవడం వలన జీర్ణక్రియను మెరుగుపరచవచ్చు, కడుపు నొప్పిని తగ్గించవచ్చు.

New Update
Desi ghee

Desi ghee

Desi Ghee: దేశీ నెయ్యి అనేది పుష్కలమైన పోషక విలువలతో కూడిన ఆహార పదార్థం. ఇది శరీరానికి శక్తిని అందించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, అంతర్గత అవయవాల పనితీరును సరిచేసుకోవడంలో సహాయపడుతుంది. భారతీయ సంప్రదాయంలో దేశీ నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక సాంప్రదాయిక పదార్థం కాదు ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఔషధ గుణాలు కలిగిన ఒక సూపర్ ఫుడ్ లాంటిది. నెయ్యి శరీరాన్ని ఉష్ణంగా ఉంచే గుణం కలిగి ఉన్నా తగిన పరిమాణంలో ఉపయోగిస్తే వేసవిలో కూడా ఇది అనేక ప్రయోజనాలు అందిస్తుంది. వేసవి కాలంలో శరీరం త్వరగా నీరసం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో దేశీ నెయ్యి శక్తిని నిలుపుకుంటూ మన దినచర్యను మామూలుగానే కొనసాగించడానికి సహాయపడుతుంది.

కడుపు నొప్పిని తగ్గించవచ్చు:

నెయ్యిలో ఉండే ఒలేయిక్ యాసిడ్, ఆక్సిడైజ్డ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మేతబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో కొవ్వును సమతుల్యం చేస్తూ బరువు తగ్గే ప్రక్రియను ఉత్సాహపరుస్తాయి. బలహీనంగా, అలసటగా అనిపించే వారు తమ రోజువారీ ఆహారంలో ఒక టీ స్పూన్ నెయ్యిని చేర్చుకోవచ్చు. ఇది శక్తిని అందించడమే కాకుండా, శరీరంలోని ముఖ్యమైన విటమిన్లను శోషించేందుకు కూడా తోడ్పడుతుంది. నెయ్యిలో విటమిన్ కె ఉండటం వలన ఇది ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో క్యాల్షియం నిల్వలు సరిగ్గా పనిచేయడానికి విటమిన్ కె అవసరం. వేసవి కాలంలో తరచూ ఎదురయ్యే కడుపు సంబంధిత సమస్యలు కూడా నెయ్యితో దూరం చేయవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీ స్పూన్ దేశీ నెయ్యి తీసుకోవడం వలన జీర్ణక్రియను మెరుగుపరచవచ్చు, కడుపు నొప్పిని తగ్గించవచ్చు. 

ఇది కూడా చదవండి: మామిడి పండ్లపై కెమికల్స్ చల్లారా? ఈ సింపుల్ చిట్కాతో ఇట్టే గుర్తుపట్టండి!

న సహాయ కారి అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పాత తరం మాటలను విశ్వసించి, సాంప్రదాయ పద్ధతిలో తినే అలవాట్లను పాటించడంలోనే అసలైన మర్మం ఉంది.ఇది పేగుల కార్యకలాపాన్ని సులభతరం చేస్తుంది. అయితే నెయ్యి ఉపయోగంలో అపరిమితంగా తినకూడదు. రోజుకు 1 నుంచి 2 టీ స్పూన్లలోపే తీసుకుంటే మేలు చేస్తుంది. అధిక పరిమాణంలో తీసుకుంటే శరీర బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేగాకుండా ఆరోగ్య సమస్యలున్నవారు, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వైద్యుడి సలహా మేరకు మాత్రమే దేశీ నెయ్యిని ఆహారంలో చేర్చాలి. ప్రతి రోజు స్వల్ప పరిమాణంలో నెయ్యిని చక్కగా వండిన అన్నంలో కలిపి తినడం ద్వారా రుచికరమైన ఆహారానికే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దేశీ నెయ్యిని వేసవిలో సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించే సమర్థవంతమై

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మహిళల ఈ తప్పులు ప్రైవేట్ భాగాలకు హాని కలిగిస్తాయి

( ghee-benefits | benefits-of-eating-ghee | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment