Tea-Dinner: భోజనం చేశాక టీ తాగుతున్నారా... ఈ సమస్యలు తప్పవు

రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది పేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం, కడుపు, నిద్ర లేమి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. అందుకే టీకి దూరంగా ఉండాలి.

New Update
drink tea after dinner

drink tea after dinner Photograph

Night Tea: భారతదేశంలో చాలా మందికి టీ తాగడం అంటే చాలా ఇష్టం. టీ లేకుండా తమ రోజు అసంపూర్తిగా ఉంటుందని భావిస్తారు. కొంతమంది ఉదయం అల్పాహారం తర్వాత టీ తాగితే, కొందరు రాత్రి భోజనం తర్వాత టీ తాగుతారు. రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగడం మీ ఆరోగ్యానికి హానికరం. భోజనం చేసిన వెంటనే టీ తాగితే అది పేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం తిన్న తర్వాత టీ తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

నిద్ర సమయం చెదిరిపోతుంది:

రాత్రిపూట భోజనం చేసిన తర్వాత టీ తాగడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే పాలు, పంచదార కలిసిన టీ తాగడం వల్ల  రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత టీకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా రాత్రి భోజనం తర్వాత టీ తాగితే నిద్ర చక్రం చెదిరిపోవచ్చు. అలవాటును సకాలంలో మెరుగుపరచుకోకపోతే నిద్రలేమికి గురవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  చలికాలంలో మార్నింగ్ వాక్‌లో ఈ పొరపాట్లు చేయొద్దు

నిద్ర సంబంధిత సమస్యలను నివారించడానికి, రాత్రి ప్రశాంతంగా నిద్రించడానికి రాత్రి భోజనం తర్వాత టీ తాగకూడదు. రాత్రి భోజనం తర్వాత టీ తాగడం అలవాటు చేసుకోకపోవడం మంచిది. ఎక్కువగా టీ తాగడం మానుకోవాలి. ఎక్కువ టీ తాగడం వల్ల మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే టీని మితంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నెలరోజులు రాత్రి జాజికాయ తింటే చెప్పలేని ఆరోగ్యం మీ సొంతం

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sri Rama Navami: ఆరోగ్యానికి శ్రీరామ నవమి పానకం రక్ష

శ్రీరామ నవమి నాడు రాముడికి నైవేద్యంగా పానకం పెడతారు. బెల్లం, యాలకులు, మిరియాలు, తులసి వంటి వాటితో తయారు చేసిన ఈ పానకం తాగితే జీర్ణ సమస్యలు అన్ని తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని అంటున్నారు.

New Update
Sri rama navami panakam

Sri rama navami panakam Photograph: (Sri rama navami panakam)

శ్రీరామ నవమికి బెల్లం పానకం నైవేద్యంగా చేసి తప్పకుండా పెడతారు. ఈ పానకంలో బెల్లం, యాలకులు, మిరియాలు, తులసి వంటివి వేసి తయారు చేస్తారు. అయితే ఈ పానకం దేవుడికి నైవేద్యంగా చేసి పెడితే మంచి మాత్రమే జరగకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

రోగనిరోధక శక్తి

బెల్లం పానకం తీసుకోవడం వల్ల బాడీకి చలవ చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలోని పోషకాలు తక్షణమే శక్తిని ఇస్తాయి. రోజంతా ఎలాంటి నీరసం, అలసట లేకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

జీర్ణ సమస్యలు
పానకంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. కొందరు అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మాత్రం పానకం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇన్ఫెక్షన్లు
బెల్లం, యాలకులు, మిరియాలు, తులసిలోని పోషకాలు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచి, జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా చేస్తుందని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

రక్తహీనత
పానకంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. 

బాడీకి చలవ
పానకం శరీరాన్ని చల్లగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
Advertisment
Advertisment