Weight Loss: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ రొట్టేలు తినండి

ఈజీగా బరువు తగ్గాలంటే రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలతో కలిపి తయారు చేసిన చపాతీలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని పోషకాలు ఫిట్‌గా ఉండేలా చేస్తాయి. ఇవి బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
weight loss3

weight loss

ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. పూర్వ కాలంలో సజ్జలు, రాగులు, జొన్నలతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినేవారు. వీటివల్ల ఎక్కువ కాలం కూడా జీవించేవారు. ప్రస్తుతం రోజుల్లో అయితే ఇలాంటి ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే కొందరు బరువు తగ్గాలని జిమ్ చేయడం, మెడిసిన్ వంటివి వాడుతున్నారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు రాగులు, జొన్నలతో తయారు చేసిన పదార్థాలను తినడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!

రక్తహీనత నుంచి విముక్తి..

గోధుమలు, జొన్నలు, రాగులు అన్ని కలిపి ఉన్న పిండితో చపాతీలు తయారు చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహారం ఈజీగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీంతో తొందరగా బరువు పెరగరు. మల్ట్రీ గ్రెయిన్ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే ఇందులోని ఐరన్ రక్తహీనత సమస్య నుంచి విముక్తి కలిగేలా చేస్తుంది. కొందరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు డైలీ వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. వీటిలో ఉండే నియాసిన్, థయామిన్, రిబోఫ్లోవిన్, బీ-కాంప్లెక్స్, విటమిన్స్ శరీర శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

ఇది కూడా చూడండి: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?

జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం రాకుండా చేస్తుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. వీటిలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బీ3 వంటివి ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. రోజు వీటితో తయారు చేసిన రొట్టేలు తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Plants: షాంపూతో మొక్కలకు పట్టిన పురుగులు పరార్‌.. ఏం చేయాలంటే!!

కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు క్రిమిసంహారక మందులు అవసరం లేదు. లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి ఈ స్ప్రే బాటిల్‌లో మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.

New Update
Plants

Plants

Plants: ఇంటిలో చిన్న తోటను సృష్టించడం వలన అందం పెరగడమే కాదు మనకు మనశ్శాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా లభిస్తుంది. అయితే మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవడంలోనూ మన బాధ్యత ఉంటుంది. మొక్కలకు హాని కలిగించే తెగుళ్లలో మీలీబగ్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి చిన్న తెల్లటి పిండిలా కనిపించే పురుగులు. మొక్కల కాండం, ఆకులపై కనిపిస్తూ వాటి జీవరసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల మొక్కలు బలహీనమవుతాయి. 

మందులు అవసరం లేదు:

ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోతూ చివరికి మొక్క నశిస్తుంది. ఇలాంటి కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు ఖరీదైన క్రిమిసంహారక మందులు అవసరం లేదు. కేవలం రూపాయి విలువైన షాంపూ పౌచ్‌తోనే దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి తయారు చేసే ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పెట్టి మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. కానీ దీన్ని సూర్యరశ్మి ఉన్న సమయంలో కాకుండా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. మొదటిసారి చేయగానే ఫలితం రాకపోవచ్చు. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: పండ్లను చూసే తియ్యగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు

దీంతో పాటు వేపనూనె కూడా ఒక మంచి సహజ పరిష్కారం. వేప నూనెను నీటిలో కలిపి పిచికారీ చేస్తే మీలీబగ్స్ నివారణకు తోడ్పడుతుంది. అంతేకాకుండా సేఫర్ సబ్బు లేదా సాదా వాషింగ్ సొప్పుతో తయారైన ద్రావణాలను ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీలీబగ్ తీవ్రత అధికంగా ఉంటే ప్రభావిత ఆకులను తొలగించడం ఉత్తమమైన చర్య. ఇలా ఇంట్లో చిన్న ప్రయత్నాలతోనే మొక్కలను కాపాడుకోవచ్చు. సహజ పద్ధతుల్లో క్రిమిసంహారక చర్యలు తీసుకోవడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: క్యాన్సర్‌ను తరిమికొట్టే అద్భుతమైన ఆహారాలు

( home-tips | home tips in telugu | latest-news | bedroom-plants | coconut-plants | Green Power Plants | houseplants)

Advertisment
Advertisment
Advertisment