/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Beetroot-Juice-jpg.webp)
Beetroot juice
ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ (Beetroot Juice) ను తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యంగ్ లుక్‌లో కనిపిస్తారు. అయితే ఉదయాన్ని బీట్ రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....
గుండె ఆరోగ్యం
బీట్‌రూట్‌లో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు (Blood Pressure) ను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
మెదడు ఆరోగ్యం
బీట్‌రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే అల్జీమర్స్ వంటి సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.
ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!
చర్మ ఆరోగ్యం
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా బీట్‌రూట్‌లో ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడతాయి. డైలీ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. నచ్చితే ఇందులో అల్లం వేసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా రావు.
బరువు తగ్గుతారు
బీట్ రూట్ జ్యూస్‌ను ఉదయాన్నే తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఊబకాయం సమస్యతో బాధపడేవారు డైలీ ఈ జ్యస్ తాగితే ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Ys Jagan:వైఎస్ జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!