/rtv/media/media_files/2025/02/24/MwE7Uirp6UGqcnzCePB6.jpg)
Blueberries Skin
Blueberries Skin: బ్లూబెర్రీలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. రక్తపోటును తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, చర్మాన్ని మెరుగుపరచడంలో, శక్తిని అందించడంలో సహాయపడుతుంది. బ్లూబెర్రీస్ అత్యంత పోషకాలు కలిగి ఉంటుంది. 150 గ్రాముల బ్లూబెర్రీస్‌లో ఫైబర్ 13%, విటమిన్ సి 14 శాతం, విటమిన్ కె 24 శాతం ఉంటుంది. దాదాపు 85 శాతం నీటిని కలిగి ఉంటాయి. ఒక కప్పు మొత్తం బెర్రీలో 84 కేలరీలు మాత్రమే ఉంటాయి. 21.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బ్లూబెర్రీల వలన ఇంక ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
చర్మం అకాల వృద్ధాప్యాన్ని..
ప్రతిరోజూ బ్లూబెర్రీ పౌడర్ తీసుకోవడం వల్ల వృద్ధులలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఆక్సీకరణ ఒత్తిడి మెదడు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది. బ్లూబెర్రీస్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. చర్మం అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని బ్లూబెర్రీస్ పెంచుతాయి.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో హైటెన్షన్.. ఒకే రోజు మూడు భారీ అగ్ని ప్రమాదాలు.. ఎక్కడెక్కడంటే?
చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మారుస్తాయి. బ్లూబెర్రీస్‌లో ఆంథోసైనిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల అభివృద్ధిని తగ్గిస్తాయి.బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌తో సహా కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: రోజూ ఈ మూడు తింటే జుట్టు రాలడం తగ్గుతుంది
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పులిసిన ఆహారాలు ఆరోగ్యానికి ఎందుకు మేలు చేస్తాయి?