LIC Market Cap: ఎల్ఐసీ వెలిగిపోతోంది.. భారీగా ఐటీ రీఫండ్స్.. పెరిగిన మార్కెట్ విలువ 

LICకి ఆదాయపు పన్ను రీఫండ్ భారీగా అందనుంది. ఈ త్రైమాసికంలో మొత్తం రూ. 25,464 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ అందుతుందని ఎల్‌ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మహంతి వెల్లడించారు. మరోవైపు LIC మార్కెట్ క్యాప్ రూ.6,83,637.38 కోట్లకు చేరుకుంది.

New Update
LIC Market Cap: ఎల్ఐసీ వెలిగిపోతోంది.. భారీగా ఐటీ రీఫండ్స్.. పెరిగిన మార్కెట్ విలువ 

LIC Market Cap: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రూ. 25,464 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ ఆర్డర్‌ను అందుకుంది.  ప్రస్తుత త్రైమాసికంలో (జనవరి-మార్చి, 2024) ఆ రీఫండ్ కంపెనీకి క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వివరాలను ఎల్‌ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మహంతి వెల్లడించారు. గత నెల, ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) 25,464.46 కోట్ల రూపాయల రీఫండ్  (LIC Market Cap)కోసం నోటీసు జారీ చేసింది. రీఫండ్ గత ఏడు అసెస్‌మెంట్ సంవత్సరాల్లో పాలసీ హోల్డర్‌లకు చెల్లించిన మధ్యంతర బోనస్‌లకు సంబంధించినది.

ఎల్‌ఐసీ కొత్త ఉత్పత్తులు..
త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా, ఈ త్రైమాసికంలో ఆదాయపు పన్ను శాఖ నుండి రీఫండ్ (LIC Market Cap)అందుతుందని ఆశిస్తున్నామని మొహంతి చెప్పారు. ఈ త్రైమాసికంలో ఎల్‌ఐసీ బాలల రక్షణతోపాటు మరిన్ని కొత్త ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్  ప్రవేశపెడుతుందని ఆయన తెలిపారు.  LIC మూడవ త్రైమాసికంలో జీవన్ ఉత్సవ్, ఇండెక్స్ ప్లస్, కొన్ని ఇతర పాలసీలను ప్రవేశపెట్టింది.  ఇది కొత్త వ్యాపారం (VNB) మార్జిన్ స్థాయిని 16.6 శాతానికి పెంచడానికి సహాయపడింది. ఇక ఐటీ రీఫండ్  నాల్గవ త్రైమాసికంలో కార్పొరేషన్ నికర లాభాన్ని పెంచే అవకాశం ఉంది. గత వారం కంపెనీ మూడవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్, 2023) ఫలితాలను ప్రకటిస్తూ, ప్రభుత్వ బీమా కంపెనీ ఈ కాలంలో నికర లాభం 49 శాతం పెరిగి రూ. 9,444 కోట్లకు చేరుకుందని, అదే త్రైమాసికంలో రూ. 6,334 కోట్లుగా నమోదైందని పేర్కొంది. 

Also Read: మన యూపీఐ ఆ దేశాల్లోనూ అందుబాటులో.. ఎవరికి లాభం అంటే.. 

కంపెనీ షేర్లలో పెరుగుదల
గత వారం ఎల్‌ఐసీ షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. గత వారంలో కంపెనీ షేర్లు 12.46 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6,83,637.38 కోట్లకు చేరుకుంది. గత వారం, ఎల్‌ఐసి మార్కెట్ క్యాప్‌లో (LIC Market Cap)గరిష్ట పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో మార్కెట్ క్యాప్‌లో రూ.86,146.47 కోట్ల పెరుగుదల కనిపించింది. అయితే శుక్రవారం కంపెనీ షేర్లు 2.30 శాతం పతనంతో రూ.1080.85 వద్ద ముగిశాయి. అయితే అదే రోజు ఒకదశలో కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో రూ.1175కి చేరుకోవడం గమనార్హం. 

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు