🔴Trump Inauguration LIVE: ట్రంప్ ప్రమాణస్వీకారం.. లైవ్ అప్‌డేట్స్!

author-image
By Manoj Varma
New Update
Trump Inauguration LIVE Updates

Trump Inauguration LIVE Updates

  • Jan 20, 2025 21:35 IST

    Joe Biden: పదవీకాలం ముగియనున్న వేళ.. జో బైడెన్ కీలక నిర్ణయం

    అమెరికా అధ్యక్షునిగా పదవీకాలం ముగియనున్న వేళ.. జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రంప్‌ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణులు డా.ఆంటోనీ ఫౌచి, అలాగే రిటైర్డ్ జనరల్ మార్క్‌ మిల్లే తదిరులకు ముందస్తు క్షమాభిక్ష ఆదేశాలు జారీ చేశారు.

    Joe Biden
    Joe Biden

     



  • Jan 20, 2025 21:21 IST

    ముగ్గురు భార్యలు.. ఐదుగురు పిల్లలు: ట్రంప్ లైఫ్ స్టోరీ ఇదే!

    అమెరికా 47వ (2) అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన బ్యాగ్రౌండ్‌ ఏమిటినేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముగ్గురు భార్యలతో ఐదుగురు పిల్లలను కన్న ట్రంప్.. ది అప్రెంటిస్‌ రియాల్టీ టీవీ షోతో భారీ పాపులర్‌ అయ్యారు. పూర్తి స్టోరీ చదవండి.

    trump
    trump Photograph: (trump)

     



  • Jan 20, 2025 20:47 IST

    వైట్ హౌస్ లో అడుగు పెట్టిన ట్రంప్

    మెలానియా ట్రంప్‌తో పాటు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కు చేరారు.  జో, జిల్ బిడెన్ ను కలుసుకున్నారు. 



  • Jan 20, 2025 20:39 IST

    అమెరికా నూతన అధ్యక్షుడిగా తొలి సంతకాలు వీటిపైనే...

    ఆర్మీలో ట్రాన్స్‌జెండర్ల నియామకానికి అడ్డుకట్ట వేయడంతో పాటు మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపడం వంటి కీలక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది.

    Trump
    Trump

     



  • Jan 20, 2025 20:33 IST

    జో, జిల్ బైడెన్ చివరి వైట్ హౌస్ సెల్ఫీ...

    అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జో బిడెన్ వైట్ హౌస్ లో తన చివరి సెల్ఫీని తీసుకున్నాడు. తన X ఖాతాలో ఈ  చిత్రాన్నిపోస్ట్ చేసారు. 

    jo biden white house selfie
    jo biden white house selfie

     

     

     

     

     



  • Jan 20, 2025 20:19 IST

    డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు శుభాకాంక్షలు

    అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం, అణ్వాయుధాలపై కొత్త అమెరికా పరిపాలనతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ తెలిపారు.

    trump putin
    trump putin

     



  • Jan 20, 2025 20:06 IST

    పోతూ.. పోతూ.. వీళ్లను ట్రంప్‌ నుంచి కాపాడటానికి జో బైడెన్ కీలక నిర్ణయం

    జో బైడెన్ అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మిడ్ నైట్ రెగ్యులేషన్ పవర్స్ వాడి కొందరు అధికారులకు క్షమాభిక్ష ప్రకటించారు. డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీ, క్యాపిటల్ హిల్‌పై దాడిపై విచారణ కమిటీ సభ్యులకు పార్థన్ ప్రసాధించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో ..

    Jo Biden: నిండు సభలో కంటతడి పెట్టిన బైడెన్‌..ఎందుకంటే!

     



  • Jan 20, 2025 12:45 IST

    అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా!

    అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ తరుణంలో అమెరికా ప్రెసిడెంట్‌కు జీతభత్యాలు ఎలా ఉంటాయి? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు?...వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో ..

    Trump security
    Trump security Photograph: (Trump security )

     



  • Jan 20, 2025 12:34 IST

    ఏడు విమానాలు, ది బీస్ట్ కారు : ట్రంప్ సెక్యూరిటీ చూస్తే మతి పోవాల్సిందే!

    ప్రపంచానికి పెద్దన్నగా పిలువబడే అమెరికా అధ్యక్షుడి భద్రత విషయంలో ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్న అత్యంత భద్రతతో కూడిన వాహనాలనే వినియోగిస్తారు. పూర్లి డీటెయిల్స్ కోసం లోపల చదవండి.

    Trump security
    Trump security Photograph: (Trump security )

     



  • Jan 20, 2025 11:51 IST

    FindCrisis



  • Jan 20, 2025 11:50 IST

    Brian Tyler Cohen



  • Jan 20, 2025 11:14 IST

    అధ్యక్షుడిగా చివరి రోజు.. జో బైడెన్‌ ఎక్కడ గడిపారో తెలుసా?

    అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగుస్తుంది.ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడిగా తన చివరి రోజున జో బైడెన్‌ ఎక్కడ ఉన్నారు, ఏ చేస్తున్నారంటే..తన పదవీకాలంలో చివరి రోజైన ఆదివారమంతా జో బైడెన్‌ దక్షిణ కరోలినాలో గడిపినట్లు తెలుస్తుంది.

    Joe Biden : నావల్ని మరణానికి పుతినే బాధ్యుడు.. బైడెన్ సంచలన ఆరోపణలు..



  • Jan 20, 2025 10:52 IST

    వారెవా.. ప్రమాణ స్వీకారం రోజే ట్రంప్ సంచలన నిర్ణయాలు!

    అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ 100 ఫైళ్లపై సంతకం చేయవచ్చు అని  తెలుస్తోంది.  వీటిలో చాలా వరకు నెరవేర్చాల్సిన ఎన్నికల హామీలే ఉన్నాయి. పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే రికార్డు సృష్టించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ ఉన్నారు.

    Trump likely to sign 100 executive orders
    Trump likely to sign 100 executive orders Photograph: (Trump likely to sign 100 executive orders)

     



  • Jan 20, 2025 10:34 IST

    పగ్గాలు చేపట్టకముందే ట్రంప్ వార్నింగ్‌ లు..చచ్చినట్లు ఒప్పుకుంటున్న సంస్థలు!

    అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ ఇంకా అధికార పగ్గాలు చేపట్టకముందే అగ్రరాజ్యాన్ని అల్లాడిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే టిక్‌ టాక్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ట్రంప్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.వివరాలు ఈ కథనంలో..

    us
    Donald Trump

     



  • Jan 20, 2025 10:33 IST

    ట్రంప్‌ ప్రమాణ స్వీకారం నేడే.. వాషింగ్టన్‌ చేరుకున్న కొత్త అధ్యక్షుడు

    అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం మధ్యాహ్నం అంటే భారతకాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.దీని కోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌ కు సైనిక విమానంలో చేరుకున్నారు.

    Also Read : https://rtvlive.com/international/donald-trump-to-take-oath-as-47th-us-president-today-8636094



  • Jan 20, 2025 10:32 IST

    ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవం విశేషాలేంటో తెలుసా ?

    జనవరి 20న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో వాషింగ్టన్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

    Trump
    Trump

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు