/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu
🔴Live News Updates:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలను ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడండి.
Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
Ravi Prakash: TV9 లోగో వివాదంపై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. TV9 మాతృసంస్థ ABCL అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నిబంధనల ఉల్లంఘణపై TV9 ఫౌండర్ రవి ప్రకాష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ABCL నుంచి తనకు రావాల్సిన హక్కులపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ABCL..TV9 లోగో ఉపయోగించినందుకు ఒప్పందం ప్రకారం 4శాతం రెవెన్యూ ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. TV9 లోగోను 2019 తర్వాత ABCL వినియోగించే అవకాశం లేనందున లోగో కాపీరైట్ తన పేరు మీదకు మార్చాలని కోర్టును కోరారు. దీంతో ఢిల్లీ హైకోర్టు TV9 మాతృసంస్థ ABCLకు ఈ విషయంపై నోటీసులు పంపింది.
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
లోగో వినియోగం విషయంలో రూ. 168 కోట్ల చెల్లింపుపై ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో TV9 లోగోపై హక్కులను రవి ప్రకాష్‌కు మార్చడం గురించి నోటీసుల్లో పేర్కొంది. 4 వారాల్లో ఈ అంశంపై, చర్యలపై వివరణ ఇవ్వాలని ABCLని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి 24 గంటల న్యూస్ ఛానల్‌గా TV9ను తీసుకొచ్చి సంచలనం సృష్టించారు రవి ప్రకాష్. 2004 ఫిబ్రవరి 1న TV9 ప్రారంభమైంది. TV9 ఆరంభం నుంచి డైరెక్టర్‌గా, CEOగా రవి ప్రకాష్ వ్యవహరించారు.
Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!
15 ఏళ్లలో టీవీ9ను అభివృద్ధి చేయడంలో రవిప్రకాశ్ కీలక పాత్ర పోషించారు. 2009లో టీవీ9 లోగోపై కాపీరైట్ ప్రొటెక్షన్ రిజిస్టర్ అయ్యింది. దీనికి రవిప్రకాశ్ ఆథర్‌గా ఉన్నారు. టీవీ9ను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఉండటం వల్ల.. ఆ లోగోను ABCL వినియోగించినందుకు ఈ సంస్థ రవిప్రకాశ్‌కు రావాల్సిన చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే లోగో హక్కు, చెల్లింపులపై ABCL మరో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Also Read: ఫైనల్లీ 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ డేట్ ఫిక్స్.. టీవీలో కూడా అదే రోజు?
Also Read: యాక్షన్ తో దుమ్ములేపిన సల్లు భాయ్.. సికిందర్ టీజర్ చూశారా?
-
Feb 28, 2025 17:13 IST
స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు
-
Feb 28, 2025 07:50 IST
Kumbhamela: కుంభమేళా ఓపెన్ బాత్... పోర్న్ సైట్లలో దర్శనమిస్తున్న మహిళల వీడియోలు!
-
Feb 28, 2025 06:45 IST
Posani Krishna Murali Arrest: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!