🔴 LIVE NEWS: మస్తాన్ సాయికి మరో షాక్.. కోర్టు కీలక ఆదేశాలు!

RTV తెలుగు న్యూస్ లైవ్ బ్లాగ్‌లో తాజా వార్తలు, లైవ్ అప్డేట్స్ లభిస్తాయి. ప్రతి రోజూ కొత్త వార్తల కోసం మా లైవ్ బ్లాగ్‌ని ఫాలో అవ్వండి! Latest News In Telugu

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

🔴 LIVE NEWS: లైవ్ అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి...

  • Feb 10, 2025 20:39 IST

    MASTHAN SAI: మస్తాన్ సాయికి మరో షాక్.. కోర్టు కీలక ఆదేశాలు!

    మస్తాన్ సాయికి రాజేంద్రనగర్‌ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లావణ్య కేసులో 2 రోజుల పాటు నార్సింగి పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌లోని వీడియోలతోపాటు మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

    mastan sai lv
    mastan sai lv Photograph: (mastan sai lv)

     



  • Feb 10, 2025 15:13 IST

    Maha Kumbhmela 2025: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే

    ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. కుంభమేళా మొదలై నెలరోజులు కావొస్తున్నా భక్తులు మాత్రం కోట్లాదిగా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు.

    Maha Kumbhmela 2025
    Maha Kumbhmela 2025

     



  • Feb 10, 2025 14:19 IST

    ఇది ధర్మంపై దాడి.. రంగరాజన్ అంశంపై పవన్ సీరియస్!

    చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇది ఒక వ్యక్తిపై కాదని.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు.

    AP Deputy CM Pawan Kalyan
    AP Deputy CM Pawan Kalyan

     



  • Feb 10, 2025 12:09 IST

    విద్యార్థులతో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ

    పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ నేడు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో సుందరవనంలో ప్రధాని కొందరు విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ విద్యార్థులకు కీలక సూచనలు కూడా చేశారు. ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

    Modi students
    Modi students Photograph: (Modi students)

     



  • Feb 10, 2025 12:07 IST

    ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

    బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రీజనబుల్ టైం అంటే ఏంటని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. పిటిషనర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణను ఈ నెల 18కి న్యాయస్థానం వాయిదా వేసింది. 

    supreme court
    supreme court Photograph: (supreme court)

     



  • Feb 10, 2025 11:55 IST

    నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్మ.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా?

    కడప నాారాయణ కాలేజీ హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకున్న ఘటన జరిగింది. నిన్న ఆదివారం కావడంతో తల్లిదండ్రులు కొడుకుని చూడటానికి వెళ్లగా ఇంటికి వస్తానని మారం చేశాడు. తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

    Narayana college
    Narayana college Photograph: (Narayana college)

     



  • Feb 10, 2025 10:24 IST

    ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్‌ కంపెనీలు

    టెక్ కంపెనీల్లో గత నాలుగేళ్ల నుంచి ఉద్యోగ కోతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.కొన్ని కంపెనీలు అయితే ఏకంగా బౌన్సర్లను పెట్టి మరి ఉద్యోగులను గెంటేస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో..

     Layoffs
    Layoffs

     



  • Feb 10, 2025 08:15 IST

    పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 30 దుస్తుల షాపులు

    హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దివాన్‌దేవిడిలోని నాలుగో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ కాస్త వ్యాపించి మొత్తం 30 షాపులకు అంటుకున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.

    Fire accident
    Fire accident

     



  • Feb 10, 2025 08:14 IST

    తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్ట్‌!

    తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నలుగురు నిందితుల్ని సీబీఐ సిట్ అరెస్టు చేసింది.వీరి నలుగుర్ని అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌కుమార్‌ నివాసానికి తీసుకెళ్లారు. రిమాండ్‌ విధించడంతో.. తిరుపతి సబ్‌ జైలుకు తరలించారు.

    tirumala employee
    tirumala employee Photograph: (tirumala employee)

     



  • Feb 10, 2025 08:13 IST

    స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

    బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,660 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,440గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

    gold uppal shop
    gold uppal shop

     



  • Feb 10, 2025 08:12 IST

    వైఎస్ జగన్‌ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!

    వైఎస్ జగన్ నివాసం దగ్గర భద్రతకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత బుధవారం జరిగిన ఘటన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో జగన్ నివాసం దగ్గర ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు.

    tadepalli palace
    tadepalli palace

     



Advertisment
Advertisment
Advertisment