KCR : మేము ఓడింది అందుకే.. 30 యూట్యూబ్ ఛానల్స్ పెడితే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

మెడికల్ కళాశాలల నిర్మాణంపై ఎక్స్(ట్విటర్‌) వేదికగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే బాగుండేదంటూ వస్తున్న సూచన ఉత్తమమైంది అన్నారు.

New Update
KTR: సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

MLA KTR : మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటాడనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన ట్విట్టర్(X) లో తన ఫాలోవెర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. యాక్టివ్ గా ఉంటాడు. అయితే, తాజా తెలంగాణ రాజకీయాలపై కౌంటర్ గా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో వైరల్ గా మారింది. అసలు కేటీఆర్ ఎందుకు ఆ ట్వీట్ చేశారు, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటనే అంశంపై నెటిజన్లు చర్చలు పెడుతున్నారు.

ALSO READ: తస్మాత్ జాగ్రత్త.. దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

కేటీఆర్ ట్విటర్ (X) లో.. మెడికల్ కళాశాలల నిర్మాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత నాకు భిన్నమైన సమాచారం అందుతోందని అన్నారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు(32 YouTube Channels) పెట్టుకుంటే బాగుండేదంటూ వస్తున్న సూచన ఉత్తమమైంది అని అన్నారు. కేసీఆర్‌పై వస్తున్న తప్పుడు వార్తలను ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఆలోచనతో నేను ఏకీభవిస్తున్నాను. 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుని ఉంటే అసత్య ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేది' అంటూ కేటీఆర్ ట్విట్టర్ గూడులో రాసుకొచ్చారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు అవును అన్న నిజమే? అభివృద్ధి చేస్తే ఎవరికీ నచ్చదు.. కేవలం ప్రచారమే కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు ఇన్ని రోజులు మీరు చేసింది అదే చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అంటూ కేటీఆర్ ట్వీట్ పై సెటైర్లు వేస్తున్నారు.

ALSO READ: తస్మాత్ జాగ్రత్త.. దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

Advertisment
Advertisment
తాజా కథనాలు