వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం పెళ్లైన కొత్త జంటల్లో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లి చేసుకున్నవారు అక్కడికి రావాలంటే నెలలు కాదు, ఏకంగా ఏళ్లు పట్టే ఛాన్స్ ఏర్పడింది. ఇది కూడా అనేక పరీక్షలు, ఇంటర్వ్యూలు దాటకొని సక్సెస్ అవుతూనే ఈ అవకాశం దక్కుతుందని అధికారులు చెబుతున్నారు. అమెరికాలో అక్రమ వలసలు పెరగడంతో వాళ్లని ట్రంప్ ప్రభుత్వం బలవంతంగా స్వదేశాలకు పంపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే పెళ్లి పేరుతో కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయా ? అని ట్రంప్ అధికారులను ఆరా తీశారు. పెళ్లి చేసుకొని అమెరికాకి వస్తామన్న వాళ్లని అన్ని కోణాల్లో పరిశీలించాలని.. ఇంటర్వ్యూలను కూడా కఠినతరం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో గత అధ్యక్షుడు జో బైడెన్ ఈ అంశంలో సులభత విధానం ప్రవేశపెట్టారు. కానీ ఆ గడువు ముగిసిపోయింది. ఇప్పుడు ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లి చేసుకున్న వాళ్లు ఇంటర్వ్యూను ఎదుర్కొనేందుకు పలు అంశాలపై ఫోకస్ పెట్టాలి. వాటిని సమర్పిస్తేనే అధికారులు దీనికి వేగంగా పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.
Also Read: నిప్పుతో గేమ్స్ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్
పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్, వివాహ ఖర్చుల రికార్డు, అలాగే ఇరుపక్షాల మధ్య జరిగిన ఫోన్ సంభాషనలకు సంబంధించిన కాల్ లాగ్స్, జీవిత భాగస్వామి పేరు మీద తీసుకున్న బీమా వంటివి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ కొత్త జంటలకు ఇంటర్వ్యులో ఇమిగ్రేషన్ అధికారులు అడిగే ప్రశ్నలు కూడా కొన్ని విచిత్రంగా ఉండనున్నాయి. బెడ్ మీరు ఏవైపు నిద్రపోతారు ? ముందుగా ఎవరు నిద్రలేస్తారు ?, మీ బాత్‌రూంలో ఎన్ని కిటికీలు ఉన్నాయి? , మీ జీవిత భాగస్వామికి ఫుడ్ అలెర్జీ ఉందా ? అనే ప్రశ్నలు కూడా అడుగుతారని ఓ ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు.
అమెరికా వ్యక్తిని పెళ్లి చేసుకునే వివాహిత భారత పౌరురాలు అయితే ఆమెను అమెరికా కాన్సులేట్ అధికారులు ఇంటర్వ్యూ చేస్తారు. జీవిత భాగస్వామి H1బీ వర్క్ వీసాపై అమెరికాలో ఉంటేనే అప్పుడు మాత్రమే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల అధికారులు ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వాళ్లు అన్ని పత్రాలను ముందుగానే ఒకిటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. అధికారుల అడిగే ప్రశ్నలకు గతంలో లాగా తేలిదు.. మర్చిపోయా అని సమాధానాలు చెబితే బయటకు పంపిచేస్తారు. బ్లాక్‌లిస్టులో పెడతారు.
అలాగే ఫేక్ వివాహాలను పసిగట్టే విషయంలో మరింత లోతుగా పరిశీలిస్తారు. ఇక దీనికి సంబంధించిన అధికారిక విధానాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. గ్రీన్‌కార్డు ఉన్నవాళ్లు, తమ జీవిత భాగస్వాములకు స్పా్న్సర్ చేసే వీసాలకు 34 ఏళ్ల సమయం పడుతోంది. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వాములను వేరు వేరుగా ఇంటర్వ్యూ చేస్తారు. సమాధానాలు సరిపోలుస్తారు. ఏదైన తేడా వస్తే బ్లాక్ చేసి పడేస్తారు.
Also Read: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం
అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసే వీసాల కోసం ఫాం ఐ130 పర్మిషన్ పొందడానికి 14 నెలల టైం పడుతుంది. ఆ తర్వాత 34 నెలలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. గ్రీన్‌కార్డు ఉన్నవారు తమ జీవిత భాగస్వాములు స్పాన్సర్ చేసే వీసా.. F2Aకి చాలా ఆలస్యం పడుతోంది. ప్రస్తుతం 2022లో దరఖాస్తు చేసుకున్న వాళ్లకి ప్రాధాన్యం ఇస్తున్నారు.
telugu-news | immigration | usa