Jyotirao Phule: భారతదేశ నిజమైన గురువు, మహాత్ముడు..జ్యోతీరావ్ ఫూలే

ఇవాళ మేం మీకో మహాత్ముడి గురించి చెప్పబోతున్నాం.. మహిళా విద్య, అంటరానితనం రూపు మాపడానికి కృషి చేసిన మహనీయుడు గురించి వివరించబోతున్నాం.. భారతదేశానికి నిజమైన గురువు జ్యోతిరావ్ ఫూలే. ఈయన వేసిన బాటే నేటి మహిళల ప్రగతికి పూదోట అయింది.

New Update
Jyotirao Phule: భారతదేశ నిజమైన గురువు, మహాత్ముడు..జ్యోతీరావ్ ఫూలే

Jyotirao Phule Biography: ఇప్పుడంటే మహిళలు స్కూల్స్‌కు వెళ్తున్నారు. ఉన్నత విద్యకు విదేశాలకూ వెళ్తున్నారు.. కానీ ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు. ఆడపిల్ల పాఠశాలలో అడుగుపెడితే పాపంగా భావించేవారు. మహిళలు ఇంటిపనులకు, వంట పనులుకే పరిమితమయ్యేవారు. వీటికి వ్యతిరేకంగా మాట్లాడితే సంఘం నుంచి బహిష్కరించేవారు. అలాంటి రోజుల్లో అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలే (Jyotirao Phule). ఏప్రిల్‌ 11న ఆయన జన్మదినం సందర్భంగా ఫూలే జీవిత చరిత్ర, ఆయన గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం!

జ్యోతిరావ్ గోవిందరావు ఫూలే 19వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక జ్ఞానోదయుడు, ఆలోచనాపరుడు, సంఘ సేవకుడు, రచయిత, తత్వవేత్త, విప్లవ కార్యకర్త. ఆయనను మహాత్మా ఫూలే , జోతిబా ఫూలే అని కూడా పిలుస్తారు. ఆయన తన జీవితమంతా మహిళలకు విద్యాహక్కు కల్పించడంలో, బాల్య వివాహాలను అరికట్టడానికి కృషి చేశారు. ఫూలే సమాజాన్ని మూఢ నమ్మకాల నుంచి విముక్తి చేయాలన్నారు. ఏప్రిల్ 11, 1827లో జన్మించిన ఫూలే నవంబర్ 28, 1890న 63 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఈ జీవిత ప్రయాణంలో మహిళల పురోగతికి ఆయన సాధించిన విజయాలు, చేసిన కృషి అనన్యసామాన్యమైనవి!

Also Read: మీ దగ్గర రూ.5లక్షలు ఉంటే..వీటిలో పెట్టుబడి పెట్టండి!

జ్యోతిబాకు 1840లో సావిత్రీబాయితో వివాహం జరిగింది. మహారాష్ట్రలో మత సంస్కరణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. మరోవైపు కుల వ్యవస్థ వ్యాపిస్తున్న కాలం కూడా అదే. అటు స్త్రీ విద్య పట్ల ఉన్న దురాచారాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడానికి జ్యోతిబా ఫూలే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 1848లో బాలికల కోసం దేశంలోనే మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించారు. ఆయన భార్య సావిత్రీబాయి పూణేలో ప్రారంభించిన ఈ పాఠశాలలో మొదటి ఉపాధ్యాయురాలు. అప్పుడు సమాజంలోని ఒక వర్గం దీనిని వ్యతిరేకించింది . దీంతో జ్యోతిబా ఫూలే తన పాఠశాలను మూసివేయవలసి వచ్చింది.

అయితే దీని తర్వాత దళితులు, అణగారిన వారికి న్యాయం చేసేందుకు జ్యోతిరావు ఫూలే సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించారు. ఇది సామాజిక మార్పు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి స్థాపించబడింది. శూద్రులు-అతిశూద్రులకు న్యాయం చేయడం, విద్య కోసం వారిని ప్రోత్సహించడం, అణచివేత నుంచి విముక్తి కల్పించడం, అణగారిన వర్గాల యువతకు పరిపాలనా రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం మొదలైనవి దీని ప్రధాన లక్ష్యాలు. ఆయన సామాజిక సేవకుగానూ 1888లో ముంబైలో జరిగిన సమావేశంలో జ్యోతిరావు ఫూలేకి మహాత్మా బిరుదు లభించింది.

ఫూలే సంస్కరణ ఉద్యమాల కారణంగానే నేడు దేశంలో బాలికలు చదువుకోగలుగుతున్నారు. సామాజిక, మేధో స్థాయిలో బానిసత్వం నుంచి ప్రజలను విడిపించే ఎన్నో ఉద్యమాలు ఆయన హయంలో పురుడుపోసుకున్నాయి. అవి ఈనాటికి ప్రతి రంగంలోనూ కొనసాగుతున్నాయి. ఫూలే ఆలోచనలు స్వాతంత్ర్య పోరాటంలోనూ భారతీయుల శక్తిగా మారాయి. ప్రజల్లో కొత్త ఆలోచనలు మొదలకు కారణమయ్యాయి. జ్యోతిరావు గోవిందరావు ఫూలే నవంబర్ 28, 1890న పూణేలో మరణించారు. ఆయన ఈ లోకాన్ని వీడి 135ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆయన ఆదర్శాలు నేటి మహిళలను ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి.

Also Read:IPL_2024: శుభ్‌మన్‌గిల్‌ కు అరుదైన రికార్డ్..చిన్న వయసులోనే ఘనత

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు.

New Update
RTC MD VC Sajjanar

RTC MD VC Sajjanar

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు. వీటి భర్తీ తర్వాత కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్  జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

Also Read: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ..పేలుతున్న మాటల తూటాలు!

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని కూడా చెప్పారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ప్రకారం మరో 18వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.     

Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

గ్రూప్​1,2,3,4 పోస్టులతోపాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో14,236 అంగన్ వాడీ, హెల్త్​ డిపార్ట్​మెంట్​లో 4 వేలకు పైగా పోస్టులకు ఏప్రిల్ చివరిలోగా నోటిఫికేషన్ రిలీజ్​ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరిన్ని శాఖల ఖాళీలపై స్పష్టత రాగానే  జాబ్​క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదలకానున్నాయి. ఇక ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  నోటిఫికేషన్‌ను షెడ్యూల్​ చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ కోసం వాయిదా వేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావాల్సివుంది. 

Also Read: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

 rtv-news | rtc | jobs

 

Advertisment
Advertisment
Advertisment