USA Elections: బైడెన్‌ కన్నా హారిస్‌ను ఓడించడం చాలా తేలిక: ట్రంప్

అధ్యక్ష రేసు నుంచి వైదొలగిన జో బైడెన్‌.. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌కు మద్దతిచ్చారు. అయితే మాజీ అధ్యక్షుడు ఒబామా మాత్రం ఇంతవరకు హారిస్‌కు మద్దతివ్వలేదు. మరోవైపు ట్రంప్ కూడా.. బైడెన్‌ కంటే కమలా హరీస్‌ను ఓడించడం చాలా తేలికని ఓ వార్త సంస్థతో అన్నారు.

New Update
USA Elections: బైడెన్‌ కన్నా హారిస్‌ను ఓడించడం చాలా తేలిక: ట్రంప్

అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం నిస్వార్థంగా వ్యవహరించారంటూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా బైడన్ నిర్ణయాన్ని కొనియాడారు. బైడెన్ తీసుకున్న నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని వ్యాఖ్యానించారు. రెండోసారి ఎన్నికల్లో బైడెన్‌కు పోటీ చేసే అర్హత ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. బైడన్‌ అంతర్జాతీయ వేదికపై అమెరికా ఔన్నత్యాన్ని ఇనుమడింపజేశారని.. నాటోను పురుజ్జీవింపజేశారని తెలిపారు. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురవుతాయన్న ఒబామా.. డెమోక్రటిక్ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు.

అయితే ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వాని బైడెన్‌ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఒబమా మాత్రం ఇప్పటివరకు హారిస్‌కు మద్దతు ప్రకటించలేదు. కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ సరైన ప్రక్రియతో రావాలని ఆయన పిలుపునివ్వడం చర్చనీయం అవుతోంది. అలాగే డెమోక్రటిక్ పార్టీకి చెందిన మరో కీలక నేత నాన్సీ పెలోసీ కూడా హారిస్‌కు మద్దతు ప్రకటించలేదు. మరో విషయం ఏంటంటే బైడెన్ అంగీకరించినంత మాత్రాన కమలా హారిస్‌ అభ్యర్థి కాలేరు. వచ్చే నెలలో పార్టీ సదస్సు జరగనుంది. ఈ సమావేశంలోనే అధ్యక్ష అభ్యర్థి నిర్ణయమవుతారు. మొత్తం 4,700 మంది ప్రతినిధులు నామినినీ ఆమోదిస్తారు.

Also Read: బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెబుతారా? పీఎం కిసాన్ డబ్బులు పెరుగుతాయా? 

మరోవైపు.. తనను అధ్యక్ష అభ్యర్థి నామినీగా మద్దతు పలికినందుకు బైడెన్‌కు కమలా హారిస్‌ ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థి నామినీగా తనకు మద్దతు పలికినందుకు అధ్యక్షుడు జో బైడెన్‌కు కమలా హారిస్‌ (Kamala Harris) ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షుడి ఆమోదం పొందడం గౌరవంగా భావిస్తున్నానని.. ఈ నామినేషన్‌ను సాధించి గెలవడమే తన ఉద్దేశమన్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన అతివాద ‘ప్రాజెక్టు 2025’ అజెండాను ఓడించడం కోసం దేశాన్ని ఏకం చేయడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అయితే హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌ ఇప్పటికే తమ మద్దతును ప్రకటించారు.

బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పుకొని.. హారిస్‌ను అభ్యర్థిగా ప్రకటించడంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ కంటే కమలా హారీస్‌ను ఓడించడం చాలా తేలిక అంటూ ఓ వార్తా సంస్థకు వివరించాడు. బైడెన్‌ హయాంలో మాతో పాటు అమెరికా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని.. మేము అధికారంలోకి వచ్చి తర్వాత బైడెన్‌ చేసిన డ్యామేజ్‌ని పూర్తి స్థాయిలో నివారిస్తామంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా ఇటీవల ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన జరిగిన తర్వాత ట్రంప్‌ గ్రాఫ్‌ పెరిగిందని ఓ సర్వే వెల్లడించింది. అలాగే తనకు బలమైన ప్రత్యర్థి అయిన జో బైడన్ అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోవడం, ఒబామా సైతం కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వకపోవడం లాంటి పరిణామాలు జరిగాయి. దీంతో ట్రంప్‌ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో కోరుతున్నదేమిటి? దానివలన ప్రజలకు లాభం ఉంటుందా?



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మునగాళ్లు

ప్లాన్ ప్రకారం టార్గెట్‌ను నాశనం చేయడమే సర్టికల్ స్ట్రైక్. భారత్ ఉగ్రవాదులపై 2016లో ఆర్మీతో, 2019లో ఎయిర్ ఫోర్స్‌తో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆర్మీలో పారా కమాండోలు, నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌లో గరుడ సర్జికల్ స్ట్రైక్స్‌కు పెట్టింది పేరు.

New Update
12556513

ఇండియాపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడినప్పుడు ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్‌లో బుద్ధి చెబుతుంది. పాక్ తీవ్రవాద చర్యలకు చేతులు కట్టుకొని కూర్చునే ప్రస్తక్తే లేదనే భారత్ గతంలో రెండుసార్లు నిరూపించింది. పహల్గామ్ దాడికి కూడా ప్రతీకారం ఉంటుందని మోదీ చెప్పకనే చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తమన్నారు. టెర్రరిజాన్ని మట్టికలిపేస్తామని శపదం చేశారు. 2016 సెప్టెంబర్ 18న యూరీ టెర్రర్ అటాక్‌కు బదులుగా పదకొండు రోజుల్లోనే సెప్టెంబర్ 29న సర్టిజికల్ స్ట్రైక్ చేసింది భారత్ ఆర్మీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని దాదాపు 35 మంది టెర్రిస్తులను మట్టుబెట్టింది. తర్వాత 2019 పుల్వామా అటాక్‌కు పాక్ చెంపపై కొట్టినట్టే 12 రోజుల్లోనే ఎయిర్ స్ట్రైక్ చేసింది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల శిభిరాలపై నిప్పుల వర్షం కురిపించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఫస్ట్ టైం ఆర్మీని, సెకండ్ టైం ఎయిర్ ఫోర్స్‌ను స్ట్రైక్ కోసం వాడారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ కౌంటర్‌గా ఇప్పుడు మూడో సారి సర్జికల్ స్ట్రైక్ జరిగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిధ దళాల్లో నేవీతో ఈసారి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని భారత్ దెబ్బకొడుతుందా..? పహల్గామ్ పర్యటకుల దాడిలో ఓ నేవి ఆఫీసర్ చనిపోయాడు. ఈసారి నేవీతో స్ట్రైక్ చేయించి రక్షణ రంగంలో త్రివిధ దళాల పవర్ ఏంటో భారత్ చూపిస్తోందా??

సర్టికల్ స్ట్రైక్

సర్జికల్ స్ట్రైక్ అంటే ఒకరకమైన మిలిటరీ అటాక్. ఇందులో సైన్యం ముందుగా టార్గెట్ పెట్టుకున్న లక్ష్యాలను మాత్రమే ధ్వంసం చేస్తుంది. అది మనుషులు కావచ్చు, లేదా ఉగ్రవాద స్థావరాలు కావచ్చు. చుట్టుపక్కల పరిసరాలు, నివాస సముదాయాలు, వాహనాలు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి వాటికి సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా చూస్తుంది. ఈ తరహా దాడులను నిర్వహించడం కష్టంతో కూడుకున్నపని. దీనికి పక్కా ప్లానింగ్‌తోపాటు శత్రువుని కనురెప్ప పాటులో అంతం చేసే సైనికులు అవసరం. మెరుపు దాడులకు ట్రైనింగ్ అయిన కమాండోస్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీలో పారాషూట్ రెజిమెంట్‌కు చెందిన పారా కమాండోలు ఇలాంటి ఆపరేషన్లు చేపట్టడంలో సిద్ధహస్తులు. నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన గరుడాలకు సర్జికల్ స్ట్రైక్స్ చేయడంలో ప్రావీణ్యం ఉన్న టీంలు.

2016లో యూరి ఉగ్రదాడికి ప్రతీకారం..

పంజాబ్‌లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ క్యాంప్‌లో 2016 జనవరి 2న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ జిహాద్ కౌన్సిల్‌కు చెందిన నలుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు. వైమానిక స్థావరంలోని సైనికులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఏడుగురు సైనికులు చనిపోయారు. మల్లీ టెర్రరిస్టులు అదే రీతిలో.. జమ్మూకశ్మీర్‌లోని యూరీ ప్రాంతంలో 2016 సెప్టెంబర్‌ 18న నలుగురు టెర్రరిస్టులు భద్రతా బలగాలపై దాడి చేశారు. దీన్నే యూరీ అటాక్ అని కూడా అంటారు. దీనికి సమాధానంగా ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది. దానికోసం ఆర్మీలో మెరుపు దాడుల్లో ఎక్స్‌పర్ట్స్ అయిన పారా కమాండోలను రంగంలోకి దింపింది. 2016 సెప్టెంబర్ 29న ఇండియా సర్జికల్ స్టైక్ చేసింది. పాకిస్థాన్ నియంత్రణ రేఖను దాటి వెళ్లి, ఉగ్రవాదులపై దాడి చేసింది. దాదాపు 35 నుంచి 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

2019లో పుల్వామా అటాక్‌కు కౌంటర్

సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదుల ఆత్మహుతి దాడి జరిగింది. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యగా మళ్లీ ఇప్పుడు భారత్ సర్జికల్ స్ట్రైక్‌ను నిర్వహించింది. ఫిబ్రవరి 26న (మంగళవారం) తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్, పీఓకేలోని ముజఫర్‌బాద్‌, చికోటీలోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీ ఉగ్రవాద శిక్షణ శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.

Advertisment
Advertisment
Advertisment