/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-21.jpg)
UPSC 2025 job Notification release
UPSC CSE 2025 Notification: యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వెలువడింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వరకు ఆన్‌లైన్ వేదికగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతేకాదు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో మరో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేయగా ఫిబ్రవరి 11వరకు అప్లై చేసుకోవాలి. ఇక ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది.
UPSC CSE 2025 Notification: 22/01/2025
— Upsc Civil Services Exam (@UpscforAll) April 25, 2024
1. UPSC CSE 2025 Prelims: 25/05/2025
2. UPSC CSE 2025 Mains: 22/08/2025#UPSC2025 pic.twitter.com/i9xANku9Zg
విద్యార్హతలు:
అభ్యర్థులకు గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత తప్పనిసరి.
వయో పరిమితి:
వయసు 21నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాలకు మినహాయింపు ఉంటుంది.
Also Read : Virat Kohli: జవాన్ సెల్ఫీకి నో చెప్పిన స్టార్ క్రికెటర్.. మండిపడుతున్న నెటిజన్లు
దరఖాస్తు ఫీజు:
ఓబీసి, ఇతర అభ్యర్థులకు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఉచితం.
ప్రిలిమినరీ పరీక్ష:
రెండు పేపర్లకుగానూ 400 మార్కులుంటాయి. ఆబ్జెక్టివ్ రూపంలో ఇచ్చే పరీక్షలో నెగెటివ్ మార్కులుంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ రాసేందుకు అర్హులు.
మెయిన్స్ పరీక్ష:
మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మెయిన్స్‌లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి రూల్‌ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలిస్తారు.
Also Read : US Deportation: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!
ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు:
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, వరంగల్
మెయిన్స్ పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, విజయవాడ.