/rtv/media/media_files/2025/01/21/sUVHSHck6o6vP0LLoB0w.jpg)
Artificial Intelligence
Artificial Intelligence: పెరుగుతున్న టెక్నాలజీతో మన వేలుతో మన కంట్లోనే పొడుచుకునేంత పని అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ శరవేగంగా డెవలప్ అవుతుంది. అన్నీ రంగాల్లో ఏఐని వాడుతున్నారు. ఇండియాలో 26 శాతం మంది జాబ్స్ ఏఐ టెక్నాలజీ కారణంగా కోల్పోతారని IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అన్నారు. స్విట్జర్లాండ్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మంగళవారం ఆమె మాట్లాడారు.
Also Read: ఉద్యోగం ఊడినా పరువు మాత్రం సేఫ్.. చైనాలో ఫేక్ జాబ్ ట్రెండ్!
14 శాతం మంది ఉద్యోగులు ఏఐ వాడకంతో ప్రయోజనం పొందుతారు. మిగిలిన 12 శాతం మంది ఉద్యోగులు మాత్రం వేరే రంగాల్లో ఉపాధి వెతుక్కుంటారని ఆమె చెప్పింది. ఈ 12 శాతం మందికి ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతుందని గీతా గోపీనాథ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి రంగంలో AI వినియోగాన్ని పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన మాటలను ఆమె గుర్తుచేశారు.
Also Read: NEET: నీట్ UG పరీక్షపై NTA సంచలన నిర్ణయం!
గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్‌డిటివి వరల్డ్ సమ్మిట్‌లో షెర్పా అమితాబ్ కాంత్ చెప్పింది కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కొంత నష్టమైనప్పటికీ ఏఐ వినియోగం అనివార్యమని ఆయన అన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడం, ఉద్యోగస్తులకు స్కిల్స్ పెంచడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని ఆమె అన్నారు.
Also Read: పేపర్ లీకులు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ