ఈ నెల 10 నుంచి విశాఖలో పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర'

ఇప్పుడు అందరి చూపు పవన్ కల్యాణ్ పై ఉంది. మొదటి రెండు విడతల వారాహి యాత్రలతో వైసీపీకి వణుకు పుట్టించిన పవన్ మూడో విడత యాత్రలో ఏం చేయబోతున్నారు? ఎలాంటి మెరుపులు మెరిపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

New Update
TS Politics: తెలంగాణలో జనసేన పోటీ చేసే 8 సీట్లు ఇవే?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రను ఇప్పటివరకు రెండు విడతలు నిర్వహించిన విషయం తెలిసిందే. త్వరలోనే వారాహి యాత్ర తదుపరి విడతను విశాఖ పట్నం నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రను విజయవంతం చేయండంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మనోహర్ మాట్లాడుతూ.. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగిందన్నారు. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలని తెలిపారు. నాయకులు, జనసైనికులు, వీర మహిళలు అంతా సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.

కాగా వారాహి యాత్ర సందర్భంగా విశాఖలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే జనవాణి కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని వెల్లడించారు నాదేండ్ల మనోహర్.

ఈ సమావేశంలో జనసేన నేతలు కోన తాతారావు, టీ శివ శంకర్, బొలిశెట్టి సత్య, సుందరపు విజయకుమార్, పరుచూరి భాస్కర రావు, గడసాల అప్పారావు, అంగ దుర్గా ప్రశాంతి, బోడపాటి శివదత్, పి ఉషాకిరణ్, పంచకర్ల సందీప్, పీవీఎస్ఎన్ రాజు, వంపూరు గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు.. మంత్రి అంబటి రాంబాబు, జనసేన సైనికుల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పవన్ పై త్వరలోనే సినిమా తీయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు 'బ్రో' టైటిల్ మాదిరిగా 'మ్రో' అనే టైటిల్ పెడతామని మంత్రి పేర్కొన్నారు. మ్యారేజెస్/రిలేషన్స్-అఫెండర్ ను కలిపి మ్రో అనే పేరు పెట్టే ఆలోచన ఉందన్నారు. అంతేకాకుండా ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందనేది కూడా చెప్పారు మంత్రి అంబటి.

మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ పై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. అంబటి హీరోగా ఓ సినిమా తీస్తున్నామన్నారు. ప్రొడెక్షన్ నెంబర్ 6093 జగ్గు బాయ్ సమర్పించు 'సందులో సంబరాల శ్యామ్ బాబు @రాంబాబు' అనే పోస్టర్ ని జనసేన శ్రేణులు విడుదల చేశారు. అంబటి వేషాధారణలో వచ్చిన జనసేన నేత, పూజలు చేసి షూటింగ్ చిత్రీకరణ ప్రారంభించారు.

త్వరలోనే మంత్రి అంబటి రాంబాబు జీవితంపై సినిమా పూర్తవుతుందని చెప్పారు. అయితే అంబటికి మంచి హీరోయిన్లు మాత్రం దొరకడం లేదన్నారు. త్వరలోనే రెడ్ లైట్ ఏరియాలో వెతికి మంచి నటిని తీసుకొస్తామని సెటైర్లు వేశారు. ఇననైనా పవన్ కళ్యాణ్ పై అనవసర మాటలు మానుకోవాలని సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.

New Update
Special Trains

Special Trains

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి , కర్నూలు నగరాలకు ఏకంగా 42 ప్రత్యేక వారపు రైళ్లను నడపడానికి సిద్ధమైంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో.. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి.

Also Read: Bharat: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

విశాఖపట్నం-బెంగళూరు మధ్య నడిచే ప్రత్యేక రైలు  ప్రతి ఆదివారం విశాఖ నుండి బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో సోమవారం బెంగళూరు నుండి విశాఖకు చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్‌పేట్‌, కుప్పం, బంగారుపేట,  కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్,  జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

Also Read: China: ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!

విశాఖపట్నం-తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైలు ప్రతి బుధవారం విశాఖ నుండి బయలుదేరుతుంది.. తిరుగు ప్రయాణంలో గురువారం తిరుపతి నుండి విశాఖకు చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి,  రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ,  జనరల్ కోచ్‌లు ఉంటాయని అధికారులు వివరించారు.


విశాఖపట్నం-కర్నూలు సిటీ మధ్య నడిచే ప్రత్యేక రైలు  ప్రతి మంగళవారం విశాఖ నుండి మొదలవుతుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం కర్నూలు సిటీ నుండి విశాఖ చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్లలో స్టాప్‌ ఉంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ,  జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ రైళ్ల బయలుదేరే సమయాల గురించిన వివరాలు ఇంకా అధికారులు వెల్లడించలేదు.

దీంతో పాటు.. హైదరాబాద్ నగరం నుండి కూడా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లను నడపడం జరుగుతోందని అధికారులు తెలిపారు.

Also Read:Whatsapp: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

Also Read:AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

vizag | tirupati | kurnool | special-trains | summer | summer-special-trains | summer-special | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment