తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఏ నియోజకవర్గం నుంచి అంటే?

2018 సంవత్సరం నుంచి జనసేన పార్టీకే అంకితమై తన వంతు సేవలందిస్తున్న మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహార్ తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ని గెలిపించడం ఎంతో అవసరమని తెనాలి నాయకులకు జనసేనాని..

New Update
తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఏ నియోజకవర్గం నుంచి అంటే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎక్కడి నుంచి ఎవరిని దింపితే.. ఈసారి గెలుస్తారో ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల సమీక్షలు కూడా జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ ఓ అడుగు ముందకేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు.

2018 సంవత్సరం నుంచి జనసేన పార్టీకే అంకితమై తన వంతు సేవలందిస్తున్న మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహార్ తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ని గెలిపించడం ఎంతో అవసరమని తెనాలి నాయకులకు జనసేనాని సూచించారు.

నాదేండ్ల మనోహర్ తెనాలి నియోజక వర్గం నుంచి 2004,2009 కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కూడా ఆయన తెనాలి నుంచే బరిలోకి దిగారు. కానీ ఓటమిని చవిచూశారు. ఈ సారి కూడా మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. మరి ఈ సారి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

కాగా వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులతో బరిలోకి దిగుతుందన్న ప్రచారం కొనసాగుతున్న క్రమంలో.. పవన్ కళ్యాణ్ తన పార్టీ నుంచి పోటీ చేసే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించి, అన్ని పార్టీలకు షాక్ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు