isreal-hamas war:ముప్పేట గాజాను చుట్టుముట్టేసిన ఇజ్రాయెల్..దాడులు తీవ్రతరం ఇజ్రాయెల్, గాజాల మద్దయ యుదధ్ం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు భీకరపోరు చేసుకుంటున్నారు. తాజాగా హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులను విపరీతం చేసింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టేసింది. విద్యుత్, ఆహారం నిలిపేయడంతో పాటూ విమానాల దాడులతో విరుచుకుపడుతోంది. By Manogna alamuru 11 Oct 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గాజా పట్టణం ప్రస్తుతం గిలగిల్లాడుతోంది. ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేయడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దానికి తోడు తిండి, కరెంట్ కూడా లేకపోవడంతో నానాపాట్లు పడుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం మొదలై ఇప్పటికి 5రోజులు అయింది. హమాస్ మొదలెట్టి ఈ భీభత్సాన్ని ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తోంది. గాజా మీద పూర్తి కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. గాజా సరిహద్దు ప్రాంతాలను హమాస్ గ్రూప్ నుంచి తిరగి స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ యుద్దంలో ఇప్పటికే ఇరువైపులా వేలాది మంది మరణించారని తెలిపింది. ఇజ్రాయెల్ లో దాదాపు 3000 మంది మహాస్ మిలిటెంట్లను చంపామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. Late night attacks on Gaza Strip by IDF#IsraelPalestineWar #Israel #Gaza #غزة_الآن #طوفان_الأقصى #Palestina #HamasMassacre #FreePalastine #PalestineUnderAttack #Palestina #HamasTerrorism #Israel_under_attack #FreePalaestine #Palestine #GazaUnderaAttack pic.twitter.com/p9odltWxS5 — Cctv media (@Cctv__viral) October 11, 2023 Listen in as an IDF Spokesperson LTC (res.) Jonathan Conricus provides a situational update on all fronts, as the war against Hamas continues. https://t.co/uuen9lQa0F — Israel Defense Forces (@IDF) October 11, 2023 ఇజ్రాయెల్ దాడికి గాజాలో ఎన్నో భవనాలు నేలకొరిగాయి. గాజాలో రెండువందల మహాస్ మిలిటెంట్ల స్థావరాల మీద దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. వీటిల్లో ఆయుధాలు దాచిన ఓ ప్రార్ధనా మందిరం, ఒక అపార్ట్‌మెంట్ కూడా ఉన్నాయని తెలిపింది. దీంతో పాటూ ఇజ్రాయెల్ నుంచి హమాస్ తీసుకెళ్ళిన ఆ దేశ పౌరులకు ఏమైనా జరిగితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఐడీఎఫ్ హెచ్చరించింది. హమాస్ కిడ్నాప్ చేసిన వారి సంఖ్య 100 నుంచి 150 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బందీల సమాచారాన్ని ఇజ్రెయెల్ అధికారులు వారి కుటుంబాలకు చేరవేస్తున్నారు. బందీలకు కనుక ఏమైనా జరిగితే హమాస్ అనేదే లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ తెగేసి చెప్పింది. దాంతో పాటూ పాలస్తీనా వాళ్ళు వీలయినంత తొందరగా ఈజిప్టు వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. మరోవైపు గాజా మీద హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తే తమ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను చంపేస్తాయని హమాస్ మిలిటెంట్లు బెదిరిస్తున్నారు. నా సోదరిని దారుణంగా చంపేశారు... ఇజ్రాయెల్-హమాన్ యుద్ధంలో నా సోదరి అన్యాయంగా చనిపోయింది అంటున్నారు హిందీ టీవీ సీరియల్ నటి మధురా నాయక్. తన సోదరిని, ఆమె భర్తను వారి పిల్లల ముందే దారుణంగా చంపారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడులలలో తన బంధువులను చాలమందినే కోల్పోయానని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. అక్టోబర్ 7న జరిగిన దాడిలో తన సోదరి, ఆమె భర్త చనిపోయారని ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు మధురా. ఇజ్రాయెల్‌లో ఉన్న బాధితులందరి కోసం మేం ప్రార్ధిస్తున్నామని ఆమె...మీరు కూడా దయచేసి ప్రార్ధించండి అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టారు. మరోవైపు హైఫా ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు వెళ్ళిన బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు. ఈమె కూడా తన భయంకరమైన అనుభవాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Madhura Naik 🧿 (@madhura.naik) Also Read:భారత అపర కుబేరుడు అంబానీ…రెండవ ప్లేస్ లో ఉన్నదెవరంటే? #militants #hamas #gaza #war #isreal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి