ISREAL WAR: భూతల యుద్ధానికి రెడీ అయిన ఇజ్రాయెల్ హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేయాలని డిసైడ్ అయింది. గాజాను నేలమట్టం చేసేందుకు భారీ ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు వైమానిక దాడికి మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ ఇప్పుడు భూమార్గంలో కూడా దాడులకు పాల్పడాలని అనుకుంటోంది. By Manogna alamuru 13 Oct 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గాజాపై భూ దాడికి సిద్ధమైంది ఇజ్రాయెల్. దీనికి సంబంధించి 11 లక్షల మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ డెడ్‌లైన్ ఇచ్చింది. 24 గంటల్లో దక్షిణ దిశకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గాజాకు నిత్యావసరాల సరఫరాను ఇజ్రాయెల్ నిలిపేసింది. ఇప్పటివరకు వైమానిక దాడులకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి ప్రతీ ఇంటినీ గాలించి మిలిటెంట్లను ఏరిపారేయాలని అనుకుంటోంది. పాలస్తీనా మిలిటెటంట్లను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా కదులుతోంది. యుద్ధానికి తమ పదాధిదళపతులు రెడీగా ఉన్నారని...ప్రభుత్వం నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యమని చెబుతున్నారు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్. భూతల యుద్ధం కోసం 3.60 లక్షల మంది సైన్యాన్ని రిజర్వ్ చేశామని తెలిపారు. ఇందుకోసం ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో ఉన్న యూదు కాలనీలను ఖాశీ కూడా చేయించారు. ఈ దాడుల వలన మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ చర్యలను ఖండించింది. ఇప్పటికఏ దాదాపు రెండు వైపులా కలిసి 2, 600 మంది మరణించారు. మరింతమందిద మరణించడం ఆందోళన కలిగించే విషయంగా మారుతుందని, యుద్ధం వలన సామాన్య మానవులు బలైపోతారని అంటోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం బందీలుగా ఉన్న తమ నౌరులను వదిలిపెడితేనే గాజాలో అటాక్ చేయకుండా ఉంటామని అంటోంది. అంతేకాదు గాజాకు ఆహారం, నీరు కూడా ఇస్తామని చెబుతోంది. మరోవైపు మహాస్ కు అండగా నిలుస్తున్న ఇతర ప్రాంతాల మీద కూడా ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. లెబనాన్, సిరియాల మీద కూడా వైమానిక దాడులను చేస్తోంది. నిన్న సిరియా రాజాని డమాస్కస్, అలెప్పీ ఎయిర్ పోర్ట్‌ల మీద దాడులు చేసింది. అలాగే లెబనాన్లో కూడా పదాధిదళపతులు అటాక్ చేస్తారని ఇజ్రాయెల్ సైన్యాధికారులు చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్‌కు ఎప్పుడూ అండగా ఉంటామని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. నిన్న ఆయన ఇజ్రాయెల్ లో పర్యటించారు. ప్రధాని నెతన్యాహుతో భేటీ అయి తాజా పరిణామాల మీద చర్చించారు. తనను తాను కాపాడుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ ఈరోజు పాలస్తీనా అధినేత మహమ్మద్ అబ్బాస్, జోర్డన్ రాజు అబ్దుల్లా-2తో కూడా సమావేశం అవనున్నారు. Also Read:అంగళ్ళు కేసులో చంద్రబాబునాయుడుకి ముందస్తు బెయిల్ మంజూరు #attack #gaza #palestine #war #isreal #tunnels మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి