/rtv/media/media_files/2025/02/16/KFfyCg9hwDFPrLkpstfw.jpg)
Zelenskyy Photograph: (Zelenskyy)
ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సాయం లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ను కాపాడటం కష్టమన్నారు. ట్రంప్, పుతిన్‌ల మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చలపై జెలెన్స్‌స్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికా మద్దతు లేకుండా తాము బతికే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు. పుతిన్ తమతో యుద్ధాన్ని ముగించాలని కోరుకోడం లేదన్నారు. విరామ సమయంలో రష్యా మరింతగా యుద్ధానికి రెడీ అవుతోందని ఆరోపించారు.
Also Read: గుండెపోటుతో వరుడు ఎలా మృతి చెందాడో చూడండి.. వీడియో చూస్తే గుండె పగలాల్సిందే!
Zelenskyy Says Ukraine To Survive Without U.S. Military Support
అంతేకాదు రష్యా వల్ల యూరప్‌కు ముప్పు పొంచి ఉందన్నారు. యూరప్ ఇకనైనా మేల్కొని.. సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచనలు చేశారు. త్వరలోనే యూరప్‌పై రష్యా అటాక్ చేసే ఛాన్స్ ఉందంటూ హెచ్చరించారు. అలాగే రష్యాతో ట్రంప్ చేస్తున్న చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఉండటాన్ని జెలెన్‌స్కీ తప్పుబట్టారు.
Also Read : కిషన్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ.. అసలేం జరుగుతోంది?
అంతేకాదు సైనికులకు ట్రైనింగ్ ఇప్పిస్తామనే సాకుతో రష్యా తమ మిత్రదేశమైన బెలారస్‌కు సైన్యాన్ని పంపిచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. పుతిన్ ఆ దేశాన్ని మరో రష్యన్ ప్రావిన్సుగా భావిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు నాటో కూటమికి ముప్పు కలిగించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా.. ట్రంప్ (Donald Trump) తాను అధ్యక్షుడిని అయిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అధికార బాధ్యతలు చేపట్టాక ఆయన పుతిన్, జెలెన్‌స్కీలతో కూడా మాట్లాడారు. యుద్ధంలో ప్రజల ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకు పుతిన్ తనతో ఫోన్‌లో అంగీకరించారని, ఉక్రెయిన్‌తో చర్చలకు కూడా సిద్ధమేనని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. కీవ్ నాటో సభ్యత్వం సాధ్యం కాదని ఆయనకు స్పష్టం చేశారు.
Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!